Advertisement

కుబేర.. వింటేజ్ నాగార్జునని దించుతున్నారా..?

Posted : March 15, 2024 at 6:57 pm IST by ManaTeluguMovies

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న కుబేర సినిమాలో ఫస్ట్ లుక్ సర్ ప్రైజ్ గా అనిపించింది. ధనుష్ బిచ్చగాడి లుక్ తో కనిపించడం ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. ఇలాంటి పాత్రలు కొట్టిన పిండిలా చేసే ధనుష్ వెంటనే పాత్రలో లీనమైనట్టుగా ఫస్ట్ లుక్ లో తన వేషధారణలో చిరునవ్వుతో సూపర్ అనిపించాడు. కుబేర సినిమాలో ధనుష్ వర్సటాలిటీ చూడటం పక్కా అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.

అయితే ఇదే సినిమాలో కింగ్ నాగార్జున కూడా ఉన్నాడని తెలిసిందే. ప్రస్తుతం నాగార్జునకి సంబంధించిన సీన్స్ బ్యాంకాక్ లో షూట్ చేస్తున్నారు. రీసెంట్ గా చిత్ర యూనిట్ బ్యాంకాక్ నుంచి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానిలో నాగార్జున వెనక నుంచి ఉన్న పిక్ ఒకటి ఉంది. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ తో నాగార్జున క్లాసీ లుక్ ఫేస్ కనిపించలేదు కానీ జులపాలతో కనిపించాడు.

నాగార్జున యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు స్టైలిష్ గా ఉండేందుకు ప్రయత్నించాడు. ముఖ్యంగా వెస్ట్రెన్ లుక్ తో తెలుగు ఆడియన్స్ కు కొత్తదనాన్ని ఇచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఒకప్పటి నాగార్జున లాంగ్ హెయిర్ తో కూల్ గాగుల్స్ తో అల్ట్రా స్టలిష్ గా ఉండేవాడు. చూస్తే మళ్లీ అలాంటి నాగార్జునని కుబేరలో దించినట్టుగా అనిపిస్తుంది.

నాగార్జున బ్యాక్ లుక్ లో క్లియర్ గా కనించలేదు కానీ లాంగ్ హెయిర్ మాత్రం ఉంది. క్లాసీ లుక్ తో నాగార్జున కేక పెట్టించేలా ఉన్నాడు. కుబేర సినిమాలో ధనుష్ తర్వాత రెండో ప్రాధాన్యత ఉన్న పాత్ర నాగార్జునదే అని తెలుస్తుంది. అందుకే అక్కినేని ఫ్యాన్స్ కుబేర మీద గురి పెట్టుకుని ఉన్నారు. ఈ సంక్రాంతికి నా సామిరంగ అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్న కింగ్ నాగార్జున కుబేరతో మరోసారి సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు.

ఈ సినిమా తర్వాత నాగార్జున సోలో సినిమా ఎవరి డైరెక్షన్ లో ఉంటుంది అన్నది మాత్రం క్లారిటీ రాలేదు. నా సామిరంగ సక్సెస్ మీట్ లో ప్రతి సంక్రాంతికి తన సినిమా పక్కా అని గట్టిగా చెప్పాడు. సో కుబేర సినిమా సంక్రాంతికి వస్తే చెప్పలేం కానీ నాగార్జున సోలో సినిమా మాత్రం ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో మొదలైనా పొంగల్ టార్గెట్ తో వస్తుందని చెప్పొచ్చు.


Advertisement

Recent Random Post:

Jabardasth Latest Promo – 04th & 05th October 2024 – Fri & Sat @9:30 PM – #EtvTelugu – Rashmi

Posted : October 2, 2024 at 1:16 pm IST by ManaTeluguMovies

Jabardasth Latest Promo – 04th & 05th October 2024 – Fri & Sat @9:30 PM – #EtvTelugu – Rashmi

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad