Advertisement

ఆఫ్టర్ కల్కి అమ్మడు బిజీ అవ్వడం ఫిక్స్..!

Posted : May 1, 2024 at 8:27 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కొత్తగా ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా అక్కడ స్టార్ హీరోయిన్ అందాల భామ దీపికా పదుకొనెకు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు. ప్రియాంక చోప్రా కి ఈక్వల్ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న దీపికా ఆమె వెళ్లినట్టుగా బాలీవుడ్ ను వదిలి వెళ్లలేదు. అందుకే దీపికాకు ఇప్పటికీ బాలీవుడ్ లో టాప్ ప్లేస్ కొనసాగుతుంది. స్టార్ సినిమాలతో పాటు దీపిక చేసే ప్రయోగాలు కూడా ఆమె ఫాం కొనసాగించేలా చేస్తున్నాయి.

అయితే ఇన్నేళ్ల కెరీర్ లో దీపికా తొలిసారి తెలుగు సినిమాకు సైన్ చేసింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమాలో దీపిక ఫిమేల్ లీడ్ గా చేస్తుంది. దీపిక ని తీసుకోవడంతో కల్కి రేంజ్ మరింత పెరిగింది. సినిమాలో దీపిక పాత్ర ఏంటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే అంతకుముందు తెలుగు ఆఫర్ వస్తే చాలా తేలికగా తీసుకున్న దీపికా ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు నేషనల్ వైడ్ గా చేస్తున్న హడావిడి చూసి కల్కికి సైన్ చేసింది.

అదీగాక ఈ సినిమాను 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించడం తో హాలీవుడ్ రేంజ్ సినిమా అని ఊహించి ఓకే చెప్పింది. దీపిక పదుకొనె కెరీర్ లో మొదటి తెలుగు సినిమాగా కల్కి వస్తుంది. అయితే ఈ సినిమా హిట్ పడితే మాత్రం దీపికకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. అమ్మడు కూడా తను అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తే టాలీవుడ్ లో చేసేందుకు రెడీ అనేస్తుంది.

కల్కి సూపర్ హిట్ పడితే దీపికా వరుస తెలుగు సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. బాలీవుడ్ సినిమాలే చేసినా తెలుగు ఆడియన్స్ లో కూడా దీపిక ఫ్యాన్స్ ఉన్నారు. కల్కి తో ఆమెను తెలుగు తెర మీద చూసి సర్ ప్రైజ్ అవుతారు. ఆ తర్వాత ఇక్కడ హీరోయిన్ గా కొనసాగితే మాత్రం దీపికాకు టాలీవుడ్ టాప్ చెయిర్ కట్టబెట్టేస్తారని చెప్పొచ్చు.

దీపిక ఈ ఇయర్ హృతిక్ రోషన్ ఫైటర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ లో కూడా కాంపిటీషన్ పెరిగిపోవడంతో తనకు వచ్చే టాలీవుడ్ ఆఫర్లకు నో చెప్పే ఛాన్స్ లేదు. సో దీపిక రాబోయే కాలంలో తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Kaadaadi Trailer (Kannada)| Aditya Shashikumar, Sony Charishta | Satheesh Malempati |BheemsCeciroleo

Posted : June 27, 2024 at 5:42 pm IST by ManaTeluguMovies

Kaadaadi Trailer (Kannada)| Aditya Shashikumar, Sony Charishta | Satheesh Malempati |BheemsCeciroleo

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement