Advertisement

కల్కి కథ.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్

Posted : June 18, 2024 at 8:04 pm IST by ManaTeluguMovies

పాన్ వరల్డ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ కల్కి 2898 AD. ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఇక ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ కాస్త నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి. 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు మినిమం ప్రమోషన్స్ కూడా చేయడం లేదు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వివిధ రకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

అయితే విడుదలకు ముందు ఈ సినిమా పై అంచనాలు ఎలా ఉన్నా కూడా విడుదల తర్వాత మాత్రమే ఒక పెద్ద సినిమాగా నిలుస్తుంది అని నిర్మాత అశ్వినీదత్ ఇదివరకే ఒక వివరణ ఇచ్చారు. ఇక సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన వీడియోలను కూడా మేకర్స్ విడుదల చేశారు. కాన్సెప్ట్ గురించి తెలియజేస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక వివరణ ఇచ్చారు.

ఈ కథ దాదాపు అన్నిటికీ ఒక క్లైమాక్స్ లాంటిది. మన కలియుగంలో ఎలా జరగబోతోంది అనే పాయింట్ ఉంటుంది. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే ఈ కథకు కనెక్ట్ అవుతారు. చిన్నప్పటి నుంచి పౌరాణిక చిత్రాలు అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా పాతాళభైరవి నా ఫేవరెట్ మూవీ. భైరవద్వీపం ఆదిత్య 369 లాంటి డిఫరెంట్ సినిమాలు చూశాను. కానీ స్టార్ వార్స్ లాంటి సినిమాలు చూసినప్పుడు ఇలాంటి స్టోరీలు మన దగ్గర వస్తే బాగుంటుంది అనిపించింది.

మన స్టైల్ లో పౌరాణిక పురాణంలో రాసిన మహాభారతం లాంటి కథలు ఎందుకు ఉండవు అని అనిపించేది. లాస్ట్ యుగం కృష్ణుడితో ఎండ్ అవుతుంది. ఇక ఆ తరువాత ఈ యుగంలో మన కథ ఎలా కొనసాగుతుంది అనేది ఈ సినిమా. కృష్ణుడి అవతారం తర్వాత దశావతారం, ఇప్పుడు మన కలియుగంలో కల్కి క్యారెక్టర్ ఉండనుంది.

ఇండియాలోనే కాకుండా వివిధ ప్రపంచ దేశాల జనాలకు కూడా ఈ స్టోరీ కనెక్ట్ అవుతుంది. మన పురాణాలకు అలాగే చరిత్రలకు అన్నిటికి ఒక క్లైమాక్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు కలి అనే వాడు ప్రతి యుగంలో ఉంటాడు. ప్రతిసారి ఒక్కొక్క రూపం తీసుకుంటాడు. ఒకసారి రావణుడు మరొకసారి దుర్యోధనుడు లాగా ఉంటాడు. ఇక ఈ కలియుగంలో ఫైనల్ గా ఒక రూపంతో కలి క్యారెక్టర్ ఉంటుంది.

ఇక అతను ఎలా ఉంటాడు? ఈ కథ ఎలా ముందుకు సాగుతుంది హీరో ఏ విధంగా పరిస్థితులను ఎదుర్కొంటాడు అనేది ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక చీకటికి వెళుతూరికి ఉండే పాయింట్స్ ను హైలైట్ చేసే ఈ కథను రాయడానికి ఐదేళ్ల సమయం పట్టింది. జనాలు ఈ కల్కి వరల్డ్ లోకి వెళితే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.. అని నాగ్ అశ్విన్ వివరణ ఇచ్చాడు.


Advertisement

Recent Random Post:

Aadivaaram with Star Maa Parivaaram Star wars | Brahmamudi vs Gundeninda gudigantalu |

Posted : September 26, 2024 at 8:51 pm IST by ManaTeluguMovies

Aadivaaram with Star Maa Parivaaram Star wars | Brahmamudi vs Gundeninda gudigantalu |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad