అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ జంటపై తాజా పుకార్ల గురించి తెలిసినదే. ఈ జంటకు అందమైన కుమార్తె ఆరాధ్య ఉంది. కానీ ఇతర జంటల్లానే వీళ్లు కూడా విడిపోతున్నారంటూ మీడియాలో పుకార్ షికార్ చేస్తోంది. రెడ్డిటర్లు, హిందీ మీడియా ప్రతినిధులు ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తుండడంతో అది బచ్చన్‌ల కుటుంబానికి ఇబ్బందిని పెంచుతోంది.
పలు సందర్భాల్లో బచ్చన్ లు తమ అసహనాన్ని సోషల్ మీడియాల్లో ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. బిగ్ బి అమితాబ్ ఇంతకుముందు మీడియా దుష్ప్రచారంపై నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఐశ్వర్యారాయ్ సైతం తన ఇండివిడ్యువాలిటీని బయటపెడుతూ మీడియా వ్యవహార శైలిని తప్పు పట్టారు. కానీ విడాకులు లేదు! అన్న ప్రకటన మాత్రం ఐష్-అభిషేక్ జంట నుంచి రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనిని ట్రోలర్లు సోషల్ మీడియాల్లో ప్రతిసారీ ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల రాధికా మర్చంట్-అనంత్ అంబానీ వివాహానికి బచ్చన్‌ల కుటుంబంతో కలిసి రాకపోవడంతో ఐశ్వర్యారాయ్ పై ఈ పుకార్లు మరింత పెరిగాయి. ఐష్ – ఆరాధ్య ఈ వేడుకలకు విడిగా రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. వారి విడాకుల పుకార్లు కొంతకాలంగా వార్తల్లో ఉండగా ‘కాఫీ విత్ కరణ్’లో జయ బచ్చన్ త్రోబాక్ కామెంట్ ఒకటి ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ క్లిప్ లో తన భర్త అమితాబ్ బచ్చన్ ఐష్ ని కోడలిగా చూడలేదని, ఒక కూతురిలానే చూస్తారని జయాబచ్చన్ వెల్లడించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
జయా బచ్చన్ ఈ క్లిప్‌లో ఇలా మాట్లాడారు. ”అమితాబ్ జీ ఆమెను చూసినప్పుడల్లా సంతోషిస్తారు. ఐశ్వర్యను కోడలుగా చూడలేదు. ఐశ్వర్యని ఎప్పుడూ కూతురిలా చూసేవాడు. అమిత్ జీ కోడలిని చూసిన నిమిషం అతడు ఇంటికి వస్తున్న శ్వేతను చూస్తున్నట్లుగా ఉంటుంది. అతడి కళ్ళు వెలుగుతాయి. శ్వేత వదిలిపెట్టి వెళ్లిన శూన్యతను ఆమె భర్తీ చేస్తుంది” అని అన్నారు.
అభిషేక్ బచ్చన్ ఇటీవల సోషల్ మీడియాలో విడాకుల కష్టాలు, పెరుగుతున్న ట్రెండ్ గురించి చర్చలో భాగమయ్యాడు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. రచయితలు హీనా ఖండేల్వాల్ షేర్ చేసిన పోస్ట్‌లో ”ప్రేమ లైట్ తీసుకునేదిగా మారినప్పుడు పెళ్లి చేసుకున్న జంటలు విడిపోతున్నారు. వారి నిర్ణయానికి కారణమేమిటి? గ్రే విడాకులు ఎందుకు పెరుగుతున్నాయి? పెరుగుతున్న విడాకుల కేసులపై కథనం గురించి క్యాప్షన్‌తో ఒక ఫోటోని అభిషేక్ బచ్చన్ షేర్ చేసారు. ”విడాకులు ఎవరికీ అంత సులభం కాదు. వృద్ధ జంటలు వీధి దాటుతున్నప్పుడు చేతులు పట్టుకుని ఉన్న ఆ హృదయాన్ని కదిలించే వీడియోలను మళ్లీ రూపొందించాలని కలలు కనేవారు ఇవేవీ ఊహించలేరు? అయినప్పటికీ కొన్నిసార్లు జీవితం మనం ఆశించినట్లుగా సాగదు.
కానీ భార్యాభర్తలు దశాబ్దాల తర్వాత ఒకరి నుంచి ఒకరు విడిపోయినప్పుడు వారి జీవితంలో గణనీయమైన భాగాన్ని పెద్ద, చిన్న విషయాల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడి గడిపిన తర్వాత వారు బ్రేకప్ ని ఎలా భరించగలరు? బంధాలను తెంచుకోవడానికి వారిని ఏది ప్రేరేపిస్తుంది? విడిపోతే వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు? ఈ ప్రశ్నలను ఈ కథ పరిశోధిస్తుంది. యాదృచ్ఛికంగా ‘గ్రే విడాకులు’ లేదా ‘సిల్వర్ స్ప్లిటర్స్’ సాధారణంగా 50 ఏళ్ల తర్వాత వివాహాన్ని రద్దు చేసుకోవాలనుకునే వారి నిబంధనలు-ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. కారణాలు వైవిధ్యంగా ఉన్నప్పటికీ, ఆశ్చర్యం లేదు”అని అతడి పోస్ట్ లో రాసి ఉంది.
ఈ పోస్ట్‌ను ‘లైక్’ చేసిన చాలా మంది వ్యక్తులలో అభిషేక్ బచ్చన్ ఒకరు. అతడి చర్య సందేహాలు రాజేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్ రెడ్డిట్‌లో భాగస్వామ్యం చేయడంతో అది వైరల్ గా చర్చకు తెర లేపింది.
ఐష్ ని బచ్చన్ తొలిసారి అలా కలిసాడు:
మరొక త్రోబాక్ ఇంటర్వ్యూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. తన భార్యతో మొదటి సమావేశం గురించి అభిషేక్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ”నా ప్రియమైన స్నేహితుడు బాబీ డియోల్ తన మొదటి చిత్రం ‘ఔర్ ప్యార్ హో గయా’ షూటింగ్‌లో ఉన్నాడు. నేను అదే లొకేషన్‌లో ఉన్నాను. ‘ఓసారి డిన్నర్‌కి రండి’ అని చెప్పినప్పుడు నేను అతడికి హాయ్ చెప్పడానికి వెళ్లాను. అదే ఐశ్వర్యకి మొదటి హిందీ సినిమా.. నేను ఆమెతో ఇంటరాక్ట్ అవ్వడం ఇదే మొదటిసారి” అని అభిషేక్ చెప్పారు. 2021లో రణవీర్ షోలో అభిషేక్ దీనిని గుర్తు చేసారు.