Advertisement

సమంత ఇలాంటి షాకులు ఇవ్వడం మామూలేగా..!

Posted : October 21, 2024 at 2:40 pm IST by ManaTeluguMovies

సినిమాల నుంచి సమంతను వేరు చేయడం ఎవరి వల్లా కాదు అని మళ్లీ మళ్లీ ప్రూవ్ చేసుకుంటుంది. విజయ్ తో రెండేళ్ల క్రితం ఖుషి సినిమా చేసిన సమంత ఇక సినిమాలకు గుడ్ బై చెబుతుందేమో అనుకున్నారు. ఆమె పర్సనల్ లైఫ్ ఇష్యూస్ వల్లే దాదాపు కెరీర్ లో చాలా వెనకపడ్డ అమ్మడు మయోసైటిస్ వల్ల ఆ కాస్త ఇంట్రెస్ట్ కూడా పోయింది. దాదాపు రెండేళ్ల పాటు సివియర్ గా బాధపడ్డ సమంత తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు తనతో తానే ఒక చిన్న పాటి యుద్ధం చేసుకుంది. ఫైనల్ గా మళ్లీ ఎప్పటిలానే కనిపిస్తున్న సమంత సినిమాల పరంగా తిరిగి ఫాంలోకి రావాలని చూస్తుంది.

సమంత కెరీర్ గ్యాప్ వచ్చినా ఆమె ఒక్క సినిమా చేస్తే చాలు ఆమె ఫ్యాన్స్ అలర్ట్ అవుతారు. ఐతే సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంది. లేటెస్ట్ గా ఆమె నటించిన సిటాడెల్ హనీ బన్ని సీరీస్ రిలీజ్ కు రెడీ అయ్యింది. నవంబర్ ఫస్ట్ వీక్ లో ఈ వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఐతే ఈ సీరీస్ డైరెక్టర్స్ రాజ్ & డీకే ఈ సీరీస్ కు సమంత ఫస్ట్ ఆప్షన్ కాదని అన్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 చేస్తున్న టైం లోనే సిటాడెల్ స్క్రిప్ట్ జరుగుతుందని.. ఆ టైంలో సమంతకు హిందీ రాదని తెలిసి సిటాడెల్ లో ఆమెను తీసుకోవాలనుకోలేదని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు రాజ్ & డీకే.

ఐతే ఆ తర్వాత ఏదో ఈవెంట్ లో సమంత హిందీ మాట్లాడటం చూసి షాక్ అయ్యామని అందుకే ఈ సీరీస్ లో ఆమెను తీసుకున్నామని అన్నారు. ఐతే సమంత కూడా ఇందుకు ఆన్సర్ ఇస్తూ తనకు హిందీ వచ్చని కాకపోతే స్టేజ్ మీద దారాళంగా మాట్లాడేంత రాదని అన్నది. ఐతే సిటాడెల్ లో సమంత సెలక్షన్ పై ఆ సీరీస్ హీరో వరుణ్ ధావన్ వెరైటీగా చెప్పారు. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే సమంత ఐతేనే ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అని తనకు అనిపించిందని అన్నారు.

మొత్తానికి బాలీవుడ్ మేకర్స్ కి సమంత తన టాలెంట్ తో సర్ ప్రైజ్ చేస్తుంది. సమంత ఇలాంటి షాక్ లు ఇవ్వడం మాములే అన్న విషయం వారికి తెలియదు. ఈగ సినిమా టైం లో సమంతని హీరోయిన్ గా తీసుకున్న రాజమౌళి థియేటర్ లో సమంత వచ్చినప్పుడు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆమె ఫాలోయింగ్ ఈ రేంజ్ లో ఉంటుందని అంచనా వేయలేదని ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సో సమంత రేంజ్ ఏంటన్నది ఆమె కాదు ఆమె ఫ్యాన్స్ చెబుతుంటారు. అందుకే ఆమె ఎన్నిసార్లు వెనక్కి వెళ్లినా తన ఫ్యాన్స్ మీద నమ్మకంతో తిరిగి ప్రయత్నాలు చేస్తుంది.. అదే రేంజ్ లో ఆమెకు అండగా ఫ్యాన్స్ నిలుస్తారు.


Advertisement

Recent Random Post:

TV9 Exclusive : తనువొక్కటే చెల్లీ.. పుడదామా మళ్లీ! | Conjoined twins Veena, Vani Birth Day –

Posted : October 17, 2024 at 12:51 pm IST by ManaTeluguMovies

TV9 Exclusive : తనువొక్కటే చెల్లీ.. పుడదామా మళ్లీ! | Conjoined twins Veena, Vani Birth Day –

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad