మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత అచ్చె నాయుడును అవినీతి కేసులో అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించిన విషయం తెల్సిందే. అయితే ఆయన ఆరోగ్యం దృష్ట్యా ప్రస్తుతం ఆయన్ను గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్‌లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అచ్చె నాయుడును పరామర్శించేందుకు ఆయన కుటుంబ సభ్యులు మరియు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కాని జైళ్ల శాఖ అనుమతులు ఇవ్వలేదు.
గత రెండు నెలలుగా కోవిడ్ కారణంగా ఎవరికి కూడా అనుమతులు ఇవ్వడం లేదు. కోవిడ్ నిబంధనల ప్రకారమే బాబుకు కూడా పర్మీషన్ ఇవ్వలేదని అన్నాడు. జీజీహెచ్ హాస్పిటల్ సూపరెండెంట్‌ను పర్మీషన్ అడుగగా అందుకు మేజిస్ట్రేట్ అనుమతులు తీసుకోవాలంటూ సూచించారు. మొత్తానికి అచ్చె నాయుడును చూసేందుకు బాబుకు పర్మీషన్ సాధ్యం కాదని తేలిపోయింది. ఆయన ఆరోగ్యం దృష్ట్య కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.