దర్శకుడు కొరటాల శివ చేసేవి అన్ని కూడా కమర్షియల్ సినిమాలే అనిపించినా కూడా ఎక్కువగా ఆయన నుండి సందేశం కూడా ప్రేక్షకులకు వస్తుంది. ఆయన మొదటి సినిమా మిర్చి నుండి మొదలుకుని భరత్ అనే నేను సినిమా వరకు కూడా ఆయన నుండి పలు సందేశాత్మక కథలు వచ్చాయి. ఇక ఆచార్య సినిమాలో అంతకు మించిన అన్నట్లుగా ఒక సోషల్ మెసేజ్ ఉంటుందని మొదటి నుండి ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెనుకబడిన తెగకు చెందిన వారి కోసం చిరంజీవి పోరాటం చేసే పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇప్పటికే చిరంజీవి నక్సలైట్ గా కనిపిస్తాడని తేలిపోయింది. ఇక చరణ్ మరియు చిరంజీవిల కలయిక సీన్స్ ఎలా ఉంటాయి అనేది తేలాల్సి ఉంది. అలాగే టెంపుల్ సిటీ సెట్టింగ్ ను వేయడం వల్ల దేవాదాయ శాఖకు సంబంధించిన విషయాలను ఇందులో చర్చించే అవకాశం కూడా ఉందని కూడా అంటున్నారు. మొత్తానికి ఈ సినిమాలో పలు సన్నిత అంశాలను చిరంజీవి తో కొరటాల శివ చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విడుదల అవ్వాల్సిన ఆచార్య సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఎప్పటికి ఈ సినిమా పట్టాలెక్కి విడుదల అవుతుంది అనేది చూడాలి.