Advertisement

ఇన్నేళ్ల అలీ కల ఇప్పుడు నిజమైంది!

Posted : April 12, 2022 at 8:01 pm IST by ManaTeluguMovies

తెలుగు తెరపై సందడి చేసిన హాస్యనటుల్లో అలీ ఒకరు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన తెలుగు తెరపై తన ముద్రను చూపిస్తూనే వచ్చారు. ‘సీతాకోక చిలుక’ సినిమాలో హీరో స్నేహితులతో ఒకరుగా ఆయన చేసిన యాక్టింగ్ చూస్తే ఆ రోజుల్లోనే .. ఆ వయసులోనే అలీ ఎంత షార్ప్ గా ఉన్నాడనేది తెలుస్తుంది. చిన్నప్పుడే అల్లు రామలింగయ్య వంటి సీనియర్స్ తో కలిసి నటించినవారాయన. చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన అలీ ఎప్పుడూ కూడా తన మూలాలు మరిచిపోలేదు. ఇండస్ట్రీపై ఒక అవగాహనకి వచ్చిన ఆయన మొదటి నుంచి కూడా జాగ్రత్త పడుతూనే వచ్చారు.

ఎలాంటి సినిమా నేపథ్యం లేని ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అలీ చాలా ప్లానింగ్ తో తన లైఫ్ ను లీడ్ చేస్తూ వచ్చారు. ఒకానొక సంయమలో హీరోగా వరుస సినిమాలు చేసినప్పటికీ తాను మొదటి నుంచి చేస్తూ వచ్చిన కమెడియన్ వేషాలు పోకుండా చూసుకున్నారు.

హీరోగా వేషాలు తగ్గినా .. కమెడియన్ గా బిజీగా ఉంటూనే అన్ని వ్యవహారాలు చక్కబెట్టారు. ఆరంభంలో తెరపై ఆకతాయిగా కనిపించిన అలీ గురించి ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా ఆయనకి చాలా ముందుచూపు ఎక్కువనే చెబుతారు. ఎందుకంటే ఆర్ధికంగా ఆయన చాలామందికంటే పైస్థానంలో ఉన్నారు.

అలీకి ముగ్గురు పిల్లలు .. వాళ్లను ఒక శ్రీమంతుడి పిల్లల మాదిరిగా కాకుండా కష్టం విలువ తెలిసేలా అలీ పెంచారని అంటూ ఉంటారు. తన వైపు బంధువర్గంలో ఎవరూ డాక్టర్ చదవలేదు. అందువలన తన పెద్ద కూతురును డాక్టర్ ను చేయాలని అలీకి ఉండేది.

దాంతో ఆ దిశగానే తన పెద్ద కూతురు ఫాతిమాను ఆయన ప్రోత్సహించాడు. ఫాతిమా కూడా తన తండ్రి కలను నిజం చేయాలానే ఉద్దేశంతో పట్టుదలతో ముందుకు వెళ్లింది. అలా మొత్తానికి ఆమె డాక్టర్ అయింది. ఈ విషయాన్ని అలీ దంపతులు తమ అభిమానులతో పంచుకున్నారు.

తమ కుటుంబంలో మొదటి డాక్టర్ ఫాతిమా అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫాతిమాను అభినందిస్తూ ఆనందంతో ఆమెను అక్కున చేర్చుకున్న ఫోటోలను షేర్ చేశారు. తండ్రి కలను నిజం చేసిన ఫాతిమాకు నెటిజన్స్ అంతా కూడా కంగ్రాట్స్ చెబుతున్నారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.


Advertisement

Recent Random Post:

నా మతం మానవత్వం ..ఎవరైనా వింటే నవ్వుతారు జగన్ | YS Jagan Reddy Vs MLA Raghu Rama

Posted : September 27, 2024 at 8:30 pm IST by ManaTeluguMovies

నా మతం మానవత్వం ..ఎవరైనా వింటే నవ్వుతారు జగన్ | YS Jagan Reddy Vs MLA Raghu Rama

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad