ఫ్రాన్స్‌లో ఆస్కార్‌తో సమానంగా భావించే సీజర్ అవార్డుల వేడుకలో నటి నగ్నంగా మారిపోవడం అక్కడివారిని ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తింది. కరోనా సమయంలో సంస్కృతికి ప్రభుత్వం మరింత మద్దతు ఇవ్వాలంటూ 57ఏళ్ల నటి కోరిన్ మాసిరో నగ్నంగా మారిపోయారు. పారిస్ ఒలింపియా కచేరీ హాల్‌లో శుక్రవారం జరిగిందీ సంఘటన. వేదికపైకి బెస్ట్ కాస్ట్యూమ్స్ అవార్డు ఇవ్వడానికి మాసిరోను ఆహ్వానించారు. రక్తమోడిన గాడిదను పోలిన డ్రెస్సింగ్ తో వేదిక పైకి వచ్చిన మాసిరో.. మాట్లాడుతూనే దుస్తులను ఒకొక్కటిగా తొలగించింది.
పూర్తి నగ్నంగా మారిపోయి అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. “సంస్కృతి లేదు, భవిష్యత్తు లేదు” అనే నినాదం ఆమె ఒంటిపై రాసి ఉంది. ఆరాతల్ని ప్రదర్శిస్తూ.. ‘ఇంతకంటే కోల్పోయేది ఏమీ లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా కళను మాకు తిరిగివ్వండి.. జీన్’ అంటూ ఫ్రెంచ్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్‌కు విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా సినిమాలు మూతబడిపోవడంపై అక్కడ అనేకమంది కొంతకాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.