Advertisement

ఆదిపురుష్ షూటింగ్ షెడ్యూల్ లో భారీ మార్పులు!!

Posted : May 7, 2021 at 7:51 pm IST by ManaTeluguMovies

రెబెల్ స్టార్ ప్రభాస్ పలు ప్యాన్ ఇండియా చిత్రాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. రాధే శ్యామ్ విడుదలకు సిద్ధమవుతుండగా సలార్, ఆదిపురుష్ ఇంకా చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటిలో ఆదిపురుష్ రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న కథ. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపిస్తాడు. కృతి సనన్ సీత పాత్ర పోషిస్తోంది.

ఈ చిత్ర షూటింగ్ మొత్తం ముంబైలోనే జరుగుతుందని మొదట ప్లాన్ వేసుకున్నారు. మొత్తంగా ఇన్ డోర్స్ లోనే గ్రీన్ మ్యాట్ సాంకేతికతను ఉపయోగించి చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో లాక్ డౌన్ నేపథ్యంలో ఆదిపురుష్ షూటింగ్ ఆగిపోయింది.

ఇప్పట్లో మహారాష్ట్రలో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఆదిపురుష్ షూటింగ్ ను ముంబై నుండి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో షూటింగ్ కు తగినట్లుగా సెటప్ ను మారుస్తున్నారట. ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.


Advertisement

Recent Random Post:

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పెన్ కానుకగా ఇచ్చిన వదిన సురేఖ l Deputy CM Pawan Kalyan

Posted : June 15, 2024 at 7:24 pm IST by ManaTeluguMovies

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పెన్ కానుకగా ఇచ్చిన వదిన సురేఖ l Deputy CM Pawan Kalyan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement