Advertisement

అఖిల్ 6 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌

Posted : May 14, 2021 at 2:43 pm IST by ManaTeluguMovies

అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన అఖిల్ ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చాడు. అఖిల్‌ నాల్గవ సినిమా మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక అఖిల్‌ 5వ సినిమాగా ఏజెంట్‌ ను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా లతో పాటు మరో సినిమాను కూడా అఖిల్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు.

అఖిల్‌ ఆరవ సినిమాకు గాను కొరటాల శివ ను రంగంలోకి దించేందుకు నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నాడనే టాక్ వినిపస్తుంది. ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ఎన్టీఆర్‌ తో మూవీ పట్టాలెక్కించబోతున్నాడు. ఆ తర్వాత అఖిల్‌ తో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అక్కినేని అఖిల్‌, కొరటాల శివల మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు.


Advertisement

Recent Random Post:

KTR Calls For Immediate Caste Census, 42% Reservation in Local Elections | KTR Press Meet

Posted : September 18, 2024 at 9:53 pm IST by ManaTeluguMovies

KTR Calls For Immediate Caste Census, 42% Reservation in Local Elections | KTR Press Meet

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad