Advertisement

మహేష్ కి జోడీగా ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Posted : March 7, 2022 at 6:21 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కి ముందే టాలీవుడ్ లో ఫేమస్ అయిపోతుంది. ఇందులో చరణ్ సరసన నటిస్తున్న సీత పాత్రలో నటిస్తుంది. సినిమాలో ఆ పాత్ర ఆద్యంతం ఆకట్టుకుంటుందని..నటనకు..నిడివికి ఎక్కువ ఆస్కారం ఉందని ఇప్పటికే ప్రచారంలో ఉంది.

ఈ ఒక్క సినిమాతోనే అలియాభట్ కి కావాల్సినంత పేరు ఇమేజ్ వస్తుందని అంచనాలున్నాయి. ఇదే బజ్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన అలియా భట్ ఛాన్స్ అందుకుంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించనున్న 30వ చిత్రంలో తారక్ ఏరికోరి మరీ అలియాని ఎంపిక చేసినట్లు సమాచారం.

కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. తాజాగా అలియాభట్ మరోసారి రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి సైన్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. సూపర్ స్టార్ మహేష్ కథానాయుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దుర్గారావు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి రచన చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కంటెంట్. దీంతో చిత్రాన్ని అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో ఓ నలభై నిమిషాల పాత్ర కోసం ఓ బిగ్ స్టార్ ని సైతం భాగా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. తాజాగా అలియాభట్ పేరు ప్రచారంలోకి రావడంతో పాన్ ఇండియాని మించే ప్రణాళికలోనే జక్కన్న ఉన్నట్లు గుసగుస వినిపిస్తోంది. ఇప్పటికే జంగిల్ అడ్వెంచర్ స్ర్కిప్ట్ అని తెలుస్తోంది. ఎలాంటి సెట్స్ లేకుండా రియల్ లోకేషన్స్ లోనే షూటింగ్ అంతా పూర్తిచేస్తారని సమాచారం. కొన్ని నెలలుగా విజయేంద్ర ప్రసాద్ సహా రాజమౌళి స్ర్కిప్ట్ పనుల్లోనే బిజీగా ఉన్నట్లు సమాచారం. ఆన్ స్ర్కీన్ పై సరికొత్త మహేష్ ఆవిష్కరించే లే స్ర్కిప్డ్ సిద్దం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో మహేష్ కి ధీటుగా ఉండే హీరోయిన్ పాత్ర కోసం సెర్చ్ చేస్తుండగా అలియాభట్ అయితే పక్కాగా యాప్ట్ అవుతుందని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా నటుల్ని సినిమాలో భాగం చేయాలని టీమ్ భావిస్తోందిట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితియార్ధంలో ప్రారంభించాలనుకుంటున్నారుట. ఈ లోపు మహేష్ ప్రాజెక్ట్ లు అన్ని పూర్తిచేసి ఫ్రీ అయిపోతారని…అప్పటి నుంచే డేట్లు కేటాయించినట్లు సమాచారం.

వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని నెలలు సమయం పడుతుంది. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ రెండింటి తర్వాత క్రేజీ కాంబినేషన్ పై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Advertisement

Recent Random Post:

Chittoor District : నెత్తురు మరిగిన చిత్తూరు జిల్లా ఘాట్‌ రోడ్లు | AP News

Posted : September 14, 2024 at 6:02 pm IST by ManaTeluguMovies

Chittoor District : నెత్తురు మరిగిన చిత్తూరు జిల్లా ఘాట్‌ రోడ్లు | AP News

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad