Advertisement

ఆర్ఆర్ఆర్ రేంజ్ లో ఆ లేడీ ఓరియంటెడ్ మూవీ హడావుడి

Posted : February 4, 2022 at 11:31 am IST by ManaTeluguMovies

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సినిమా లను ఎంత రిచ్ గా తెరకెక్కిస్తాడో.. ఎంత క్రియేటివిటీగా తెరకెక్కిస్తాడో అందరికి తెల్సిందే. సినిమా మేకింగ్ సమయంలో రాజమౌళి ఎంత కష్టపడతారో.. ఎంత క్రియేటివిటీగా ఆలోచిస్తారో అంతే క్రియేటివిటీని ప్రమోషన్ సమయంలో కూడా వినియోగిస్తారు. ఎలా చేస్తే సినిమా ను జనాల్లోకి ఎక్కువగా తీసుకు వెళ్లగలం అనేది ఆయన వద్ద నుండి అంతా నేర్చుకోవచ్చు. ఆయన ప్రమోషన్ విషయంలో మాస్టర్ అనడంలో సందేహం లేదు. ఆయన తన ప్రతి సినిమాకు కూడా కొత్త కొత్త ప్రమోషన్ ట్రిక్స్ ను వినియోగిస్తూ ఉంటాడు.

ఆయనకు వచ్చే ఆలోచనలో లేదా ఆయన టీమ్ లో ఉన్న వారి ఆలోచనలో కాని ఆర్ ఆర్ ఆర్ సినిమా కు అద్బుతమైన ప్రమోషన్ చేస్తున్నారు. ఇక రాజమౌళి తన సినిమా ట్రైలర్ ను సాదారణంగా యూట్యూబ్ లో రిలీజ్ చేయడం లేదంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసి విడుదల చేయడం కాకుండా థియేటర్లలో విడుదల చేయడం పరిపాటుగా వస్తుంది. రాజమౌళి తర్వాత అలా థియేటర్లలో అభిమానుల కోసం చాలా మంది ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాల ట్రైలర్స్ ను ఆ రేంజ్ లో విడుదల చేయడం జరిగింది.

ఇప్పుడు ఆలియా భట్ నటించిన గంగూభాయ్ సినిమా ట్రైలర్ ను కూడా ఆ రేంజ్ లోనే విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. నేడు భారీ ఎత్తున విడుదల కాబోతున్న గంగూభాయ్ ట్రైలర్ గురించి జాతీయ మీడియాలో ప్రథానంగా చర్చ జరుగుతూ సినిమా పై అంచనాలు పీక్స్ కు చేరేలా చేశాయి. దేశ వ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రముఖ మల్టీ ప్లెక్స్ చైన్ థియేటర్లలో గంగూభాయ్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. షో టైమింగ్స్ లో ఈ ట్రైలర్ ను స్క్రీనింగ్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున అభిమానులకు ఈ ట్రైలర్ చేరుతుందనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ సభ్యులు న్నారు.

ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ ను కూడా దేశ వ్యాప్తంగా పలు థియేటర్లలో విడుదల చేసిన విషయం తెల్సిందే. అందుకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమా కు ఉన్న బజ్ మరింతగా పెరిగింది. అందుకే ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్రైలర్ తరహా లో ఆలియా భట్ హీరోయిన్ గా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ గంగూభాయ్ ట్రైలర్ ను కూడా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన గంగూభాయ్ సినిమాలో ఆలియాభట్ లుక్ ఇప్పటికే సినిమా పై అంచనాలు పీక్స్ కు తీసుకు వెళ్లారు. ఇక సినిమా టీజర్ కూడా సినిమా పై అంచనాలు పెంచింది. కనుక ట్రైలర్ అంతకు మించి ఉంటుందని ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉన్నారు. సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్లుగా ట్రైలర్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గంగూభాయ్ సినిమాలో ఆలియా భట్ జాతీయ అవార్డు దక్కించుకునే స్థాయిలో నటించింది అంటూ మేకర్స్ చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. ఆయన లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా ఆయన వల్ల సినిమాలో సన్నివేశాలు మరింతగా హైలైట్ అవుతాయనే నమ్మకంతో హిందీ ప్రేక్షకులు ఉన్నారు. కరోనా కారణంగా ఏడాది కారణంగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పటికి విడుదల కాబోతుంది. కరోనా థర్డ్ వేవ్ తర్వాత రాబోతున్న మొదటి అతి పెద్ద బాలీవుడ్ చిత్రం ఇదే కావడం విశేషం. అంతే కాకుండా ఈ ఏడాదిలో బాలీవుడ్ నుండి రాబోతున్న పెద్ద సినిమా కూడా ఇదే. కనుక బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.


Advertisement

Recent Random Post:

Annamayya District : కార్లలో రాళ్లు తీసుకొచ్చిమరీ షాపులపై ఎటాక్

Posted : October 21, 2024 at 1:01 pm IST by ManaTeluguMovies

Annamayya District : కార్లలో రాళ్లు తీసుకొచ్చిమరీ షాపులపై ఎటాక్

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad