Advertisement

అల్లు అరవింద్‍ ప్రయోగం వికటించింది

Posted : August 22, 2020 at 6:20 pm IST by ManaTeluguMovies

ఓటిటిల కోసం ఒరిజినల్‍ కంటెంట్‍ ప్రొడ్యూస్‍ చేయడంలో తెలుగు నిర్మాతలు, దర్శకులు విఫలమవుతున్నారు. ఓటిటి కోసం తక్కువ బడ్జెట్‍లో, లిమిటెడ్‍ యూనిట్‍తో వెబ్‍ సినిమాలు తీయవచ్చునని ప్రయోగాత్మకంగా ‘మెట్రో కథలు’ తీసారు. ముప్పయ్‍ లక్షల వ్యయంతో ఆహా కోసం ఈ చిత్రాన్ని ఎక్స్పెరిమెంటల్‍గా చేసారు. పలాస దర్శకుడు కరుణ కుమార్‍ దర్శకత్వంలో షార్ట్ స్టోరీస్‍తో చేసిన ఈ ప్రయోగం దారుణంగా వికటించింది. సినిమా బాగోకపోవడం ఒకటయితే అసలు ఎందుకు తీసారో కూడా అర్థం కాకుండా తయారవడంతో ఆహా విమర్శల పాలవుతోంది.

మంచి కంటెంట్‍ ప్రొడ్యూస్‍ చేయడంలో ఆహా మళ్లీ మళ్లీ ఫెయిలవుతూ వుండడం ఓటిటిని తేలికగా తీసుకోరాదనే పాఠం నేర్పించింది. బడ్జెట్‍ ఎంత వున్నా కానీ కంటెంట్‍ పరంగా క్వాలిటీ మెయింటైన్‍ చేయక తప్పదు. ఇలాంటి మెట్రో కథల లాంటివి మరో రెండు వచ్చాయంటే ఆహా నుంచి కొత్త సినిమా వస్తుందన్నా కానీ ప్రేక్షకులు పట్టించుకోరు.

గిరాకీ లేని రాంగోపాల్‍వర్మ వెబ్‍ సినిమాల మాదిరిగా ఎటూ కాకుండా మిగిలిపోవాల్సి వస్తుంది. లాక్‍ డౌన్‍లో పెద్ద సినిమాల హక్కులు సాధించడానికి చొరవ చూపించకపోవడం వల్ల ఆహా మరోసారి అమెజాన్‍, నెట్‍ ఫ్లిక్స్, జీ5 తదితర ఓటిటి జయంట్స్ ముందు వెలవెలబోతోంది.


Advertisement

Recent Random Post:

వచ్చే ఎన్నికల్లో కూడా Pawan తోనే! : CM Chandrababu Naidu Comments on Mangalagiri Review Meeting

Posted : October 19, 2024 at 1:04 pm IST by ManaTeluguMovies

వచ్చే ఎన్నికల్లో కూడా Pawan తోనే! : CM Chandrababu Naidu Comments on Mangalagiri Review Meeting

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad