తెలుగు చిత్రాల పరంగా ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ మొదలైపోయింది. `బాహుబలి`..`కేజీఎప్`..ఇటీవలే రిలీజ్ అయి సక్సెస్ అయిన `ఆర్ ఆర్ ఆర్` లాంటి చిత్రాలు మరిన్ని పాన్ ఇండియా చిత్రాలకు ఆజ్యం పోస్తున్నాయి. సౌత్ నుంచి నార్త్ వరకూ అంతా తెలుగు సినిమాల వైపు చూస్తున్న తరుణమిది. తెలుగు స్టార్ హీరోలతో..టాలీవుడ్ మేకర్స్ తో పనిచేయడానికి పరభాష నటులు అమితాసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇలయ దళపతి విజయ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే ధనుష్ హీరోగా శేఖర్ కమ్ములా సైతం ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. మరో ప్రాజెక్ట్ సైతం ధనుష్ లైన్ లో పెడుతున్నాడు. రాజమౌళి ఒకే చెప్పాలే గానీ బాలీవుడ్ మిస్టర్ పర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ సైతం రంగంలోకి దిగడానికి రెడీగా ఉన్నారు.
అది తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు. ఇక `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ అయిపోయింది కాబట్టి జక్కన్న అండ్ కో మహేష్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించనున్నారు. ఆప్రికన్ ఆడవుల నేపథ్యంలో ఇండియాలోనే మొట్ట మొదటి ప్రాజెక్ట్ గా దీన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడిదే స్పూర్తితో క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ సైతం పాన్ ఇండియా అప్పీల్ పై కన్నేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కొరటాల-బన్నీ మధ్య కమిట్ మెంట్ జరిగింది. అయితే ఇప్పుడీ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో మరో స్టార్ హీరోని జత చేసి మల్టీస్టారర్ గా తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారుట. కోలీవుడ్ స్టార్..నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ ని మరో హీరోగా తీసుకుని బన్నీ చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరీలో ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది.
ధనుష్ కి తమిళ్ తో పాటు..హిందీ బాషలోనూ మంచి పేరుంది. డబ్బింగ్ సహా స్ర్టెయిట్ చిత్రాల్ని తెలుగులో చేస్తున్నాడు. ఆ రకంగా ధనుష్ ఇమేజ్ బాగానే వర్కౌట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే కొరటాల బన్నీ ప్రాజెక్ట్ ని మల్టీస్టారర్ గా మారుస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే కొరటాల-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా పట్టాలెక్కనుంది. ఆ సినిమా పూర్తయిన తర్వాత బన్నీ-ధనుష్ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు అధికారికంగా రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొరటాల `ఆచార్య` రిలీజ్ హడావుడిలో నిమగ్నమయ్యారు