అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా కూడా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా వేయడం జరిగింది. మరో నెల రోజుల వరకు కూడా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశం లేదని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఈ సమయంను బన్నీ ఏమాత్రం వృదా చేయకుండా ఫుల్ గా వాడేసుకుంటున్నాడు.
తెలుగుతో పాటు పుష్ప చిత్రంను మొత్తంగా అయిదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. అయిదు భాషల్లో కూడా డబ్బింగ్ చెప్పేందుకు బన్నీ సిద్దం అవుతున్నాడు. అందుకోసం తమిళం, మలయాళం, కన్నడం మరియు హిందీ భాషల విషయంలో శిక్షణ పొందుతున్నట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకు చిత్తూరు యాసను నేర్చుకున్న బన్నీ ప్రస్తుతం హిందీ, కన్నడం, మలయాళం, తమిళ భాషల డైలాగ్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం కోసం ఎన్టీఆర్ మరియు చరణ్ లు స్వయంగా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పబోతున్నారు. ఆ సినిమాలో మాదిరిగానే పుష్ప చిత్రం కోసం కూడా బన్నీ మొత్తం అన్ని భాషల్లో కూడా డబ్బింగ్ చెప్పబోతున్నాడు. ఇదే కనుక నిజం అయితే బన్నీ అరుదైన రికార్డును దక్కించుకోవడం ఖాయం. జక్కన్న సినిమాలు మాత్రమే అయిదు భాషలో విడుదల అయ్యి సక్సెస్ అయ్యాయి. మరి పుష్పతో ఆ సక్సెస్‌ను బన్నీ కూడా దక్కించుకుంటాడా చూడాలి. సక్సెస్ కోసం బన్నీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. బన్నీ మొదటి పాన్ ఇండియా సక్సెస్ ను దక్కించుకుంటాడా చూడాలి.