Advertisement

అల్లు వారి సెకండ్ హ్యాండ్ యాపారం

Posted : August 6, 2020 at 6:40 pm IST by ManaTeluguMovies

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలే నడుపుతాయని.. అది చాలా పెద్ద వ్యవహారం అని.. పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుందని.. ఓటీటీ మొదలుపెట్టినా దాన్ని నడపడం అంత తేలికైన విషయం కాదని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ ఆలోచన తప్పు అని రుజువు చేశాడు అల్లు అరవింద్.

ఓ నిర్మాతగా తన దగ్గరున్న సినిమాలకు తోడు.. కొన్ని కొత్త చిత్రాలు కొని పెట్టి ‘ఆహా’ పేరుతో ఓటీటీ ఫ్లాట్ ఫాం మొదలుపెట్టారాయన. వాటితో సరిపెట్టకుండా సొంతంగా వెబ్ సిరీస్‌లు తయారు చేసి అందులో రిలీజ్ చేశారు. అలాగే ఎప్పటికప్పుడు కొత్త సినిమాల్ని ‘ఆహా’లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

‘భానుమతి రామకృష్ణ’ సినిమాను ఓన్ రిలీజ్ చేశారు. ఐతే ఇలా నిలకడగా కొత్త సినిమాల్ని డైరెక్ట్‌గా రిలీజ్ చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. డిజిటల్ హక్కుల్ని ఎక్స్‌క్లూజివ్‌గా తీసుకోవాలన్నా ఖర్చు ఎక్కువే.

అందుకే అరవింద్ సెకండ్ హ్యాండ్ వ్యాపారం మొదలుపెట్టారు. ఆల్రెడీ వేరే ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజైన సినిమాల్ని తీసుకుని కొంచెం లేటుగా రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం వేరే ఓటీటీలతో టై అప్ అవుతున్నారు.

నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాను ఐదారు రోజులు ఆలస్యంగా ‘ఆహా’లోనూ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులోనే ఉన్న ‘ఫోరెన్సిక్’ చిత్రాన్ని కూడా తీసుకుని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ను కూడా ఇలాగే రిలీజ్ చేయబోతున్నారట. ఇంకా అమేజాన్‌లో ఉన్న ‘ట్రాన్స్’ హక్కులు కూడా తీసుకుని తెలుగు డబ్బింగ్‌తో రిలీజ్ చేశారు.

ఇది ఎక్స్‌క్లూజివ్ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్. వేరే ఫ్లాట్ ఫామ్స్‌లో వేరే భాషల్లో ఉన్న చిత్రాల్ని తీసుకుని అనువాదం చేసి ‘ఆహా’లో రిలీజ్ చేస్తున్నారు. ఇలా సెకండ్ హ్యాండ్ సినిమాలు తీసుకుని నేరుగా రిలీజ్ చేయడం, లేదంటే అనువాదం చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో కంటెంట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అల్లు వారు.


Advertisement

Recent Random Post:

గెలుపెవరిది.. ఏపీ సచివాలయంలో హాట్ డిస్కషన్ | OTR

Posted : April 24, 2024 at 2:45 pm IST by ManaTeluguMovies

గెలుపెవరిది.. ఏపీ సచివాలయంలో హాట్ డిస్కషన్ | OTR

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement