అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ జూన్ జులై వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. పుష్ప సినిమా పూర్తి అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే క్యాన్సిల్ అయ్యింది. సినిమా క్యాన్సిల్ అయ్యిందా లేదా వాయిదా పడిందా అనే విషయంలో స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం లేదు కాని యూనిట్ సభ్యుల నుండి మాత్రం వచ్చే ఏడాది బన్నీ కొరటాల కాంబో ఉంటుందని అంటున్నారు. వీరిద్దరి కాంబోలో మూవీ కంటే ముందు పుష్పను ముగించిన తర్వాత చేయాల్సిన సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి.
బన్నీ కోసం ఇద్దరు దర్శకులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఐకాన్ ను ప్రకటించిన వేణు శ్రీరామ్ తో పాటు ఎఫ్ 3 సినిమా దర్శకుడు అనీల్ రావిపూడి కూడా బన్నీతో సినిమాను చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాడట. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు నుండి మరో ఆఫర్ వచ్చినట్లే వచ్చి త్రివిక్రమ్ వల్ల చేజారింది. ఇప్పుడు బన్నీ నుండి కూడా కాల్ వచ్చిందని సమాచారం అందుతోంది. బన్నీ వీరిద్దరిని కూడా హోల్డ్ లో ఉంచాడు. త్వరలోనే ఒక దర్శకుడి వైపు బన్నీ వెళ్లే అవకాశం ఉంది. ఆ దర్శకుడు ఎవరు అనేది ఒకటి రెండు నెలల్లో క్లారిటీ వస్తుందని అంటున్నారు.