Advertisement

హీరో దాతృత్వంపై ఫేక్ పోస్టులు.. అంతలేద‌న్న స్టార్ హీరో!

Posted : May 5, 2020 at 11:52 am IST by ManaTeluguMovies

వెర్రిగొర్రె అభిమానులు త‌మ‌కు న‌చ్చిన వారి గురించి పాజిటివ్ గా ఫేక్ పోస్టులు పెట్ట‌డానికి ఏ మాత్రం వెనుకాడ‌రు అలాంటి ఫేక్ పోస్టులు పెట్టి త‌మ హీరోల గ్రాఫును పెంచాల‌ని, వారేదో మంచి ప‌నులు చేస్తున్న‌ట్టుగా ప్ర‌చారం చేస్తుంటారు ఈ గొర్రె అభిమానులు. ఎంత‌లా అంటే.. స‌దరు హీరోలు చేయ‌ని మంచి ప‌నుల‌ను కూడా చేస్తున్న‌ట్టుగా, చేసినట్టుగా ఈ గొర్రెలు ప్ర‌చారం చేస్తూ ఉంటాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కూ ఈ గొర్రెల‌కు లోటు లేదు. ఫేక్ పోస్టుల‌తో తాము అభిమానించే సినీ హీరోల‌ను నిజ జీవిత హీరోలుగా చేయ‌డానికి అభిమానుల ముసుగులోని మూర్ఖ‌పు మంద ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటుంది.

ఆఖ‌రికి క‌రోనా వంటి విప‌త్తు వేళ కూడా త‌ప్పుడు ప్ర‌చారాల ద్వారా త‌మ హీరోల గ్రాఫ్ ను పెంచ‌డానికి, వారేదో దాన‌ప‌రులైన‌ట్టుగా చిత్రీక‌రించ‌డానికి ఈ అభిమానులు వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ఇలాంటి విప‌త్తు స‌మ‌యంలో, లాక్ డౌన్ బాధితుల‌ను కూడా త‌ప్పుడు ప్ర‌చారాల కోసం వీరు వాడుకుంటున్నారు. ఏ మాత్రం మ‌న‌సు లేకుండా వ్య‌వ‌హ‌రిస్తూ ఉన్నారు. ఇలాంటిదే బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ విష‌యంలోనూ జ‌రిగింది.

ఆ హీరో లాక్ డౌన్ వ‌ల్ల ఉపాధి లేకుండా పోయిన వారికి భారీగా సాయం చేస్తున్న‌ట్టుగా పిచ్చి ఫ్యాన్స్ ఎవ‌రో త‌ప్పుడు ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టారు. ఆ ప్ర‌చారంలో పీక్స్ ఏమిటంటే.. ఈ హీరో లాక్ డౌన్ వ‌ల్ల ప‌ని లేకుండా పోయిన కార్మికుల ఇళ్ల‌కు బియ్యం క‌వ‌ర్ల‌ను అందించార‌ని, ప్ర‌తి బియ్యం క‌వ‌ర్ లోనూ 15 రూపాయ‌ల డ‌బ్బును కూడా పెట్టి పంచార‌ని, వాటిని తీసుకున్న కార్మికులు అందులోని డ‌బ్బును చూసి సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోన‌వుతున్న‌ట్టుగా సోష‌ల్ మీడియాలో ప్రచారానికి తెరతీశారు కొంత‌మంది

ఆ హీరోపై అభిమాన పిచ్చి ముదిరిన వాళ్లు మొద‌లుపెట్టిన ఈ త‌ప్పుడు ప్ర‌చారం ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది, ఇది నిజం అనుకుని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా క‌థ‌నాల‌ను రాసింది. అయితే అది త‌ప్పుడు ప్ర‌చారం అని తేలిపోయింది. త‌న ద‌గ్గ‌ర అలా సంచుల‌కొద్దీ డ‌బ్బులు లేవ‌ని, తానేం రాబిన్ హుడ్ కాద‌ని.. స్వ‌యంగా ఆమిర్ ఖాన్ ట్వీట్ చేశాడు. త‌న‌పై జ‌రుగుతున్న వీరాభిమాన‌పు త‌ప్పుడు ప్ర‌చారానికి ఆయ‌నే తెర‌దించే ప్ర‌య‌త్నం చేశారు. ఇదంతా చూశాకా.. సినీ హీరోల‌ అభిమానం అనే మూర్ఖత్వంలో మునిగిపోయిన గొర్రెల‌ను ఏమ‌నాలో!


Advertisement

Recent Random Post:

Dialogue War : CM Revanth Reddy Vs Etela Rajender

Posted : April 28, 2024 at 7:34 pm IST by ManaTeluguMovies

Dialogue War : CM Revanth Reddy Vs Etela Rajender

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement