Advertisement

స్పోర్ట్స్ డ్రామాలో కనిపించనున్న ఆమిర్ ఖాన్?

Posted : January 28, 2021 at 6:18 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా నెమ్మదిగా సినిమాలు చేసే అలవాటున్న ఈ వెర్సటైల్ నటుడు ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నాడు. అమెరికన్ సినిమా ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.

ఇదిలా ఉంటే ఆమిర్ ఖాన్ తర్వాతి సినిమాపై ఇప్పటినుండే ఫోకస్ పెరిగింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం శుభ్ మంగళ్ సావధాన్ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న ఆర్ఎస్ ప్రసన్న ఆమిర్ ఖాన్ తో సినిమా చేసే అవకాశాన్ని పట్టేసాడు.

ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అని అంటున్నారు. అయితే ఇందులో కేవలం క్రీడ గురించే కాక ఇన్స్పిరేషనల్ పాయింట్ ను కూడా టచ్ చేస్తున్నారట. ప్రస్తుతం టాక్స్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయని త్వరలోనే ఆమిర్ ఈ ప్రాజెక్ట్ పై తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడని తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

Sajjala Ramakrishna Reddy Sensational Comments on Pawan Kalyan, Chandrababu

Posted : April 21, 2024 at 8:22 pm IST by ManaTeluguMovies

Sajjala Ramakrishna Reddy Sensational Comments on Pawan Kalyan, Chandrababu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement