తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే మరియు బీజేపీ కూటమి గెలుపు సాధించాలంటే ఇప్పుడు ఉన్న బలం సరిపోదని మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి అయిన శశికలను రంగంలోకి దించాల్సిందే అంటే అమిత్ షా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. శశికళ ఇప్పటికి కూడా అన్నాడీఎంకే పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్దంగా ఉంది. జాయిన్ ఏంటీ అన్నాడీఎంకే పార్టీ తనదే అన్నట్లుగా ఆమె మాట్లాడుతుంది. కనుక పన్నీర్ మరియు పళనిలు ఆహ్వానిస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది.
అధికారంలో ఉన్నా కూడా అన్నాడీఎంకే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందుకే శశికళ చేరితో పార్టీకి ఉత్సాహం వస్తుందని అంటున్నారు. అదే జరిగితే మిత్ర పక్షంగా ఉన్న బీజేపీ కూడా లాభపడుతుంది. డీఎంకే మరియు కాంగ్రెస్ ను ఈ సమయంలో ఎదుర్కోవాలంటే చాలా కష్టం. అందుకే శశికళను తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకు రావాల్సిందిగా షా రాష్ట్ర నాయకత్వంకు సూచించాడట. కాని పన్నీర్ సెల్వ మరియు పళనిస్వామి మాత్రం ఆమె రాకపై ఆసక్తి చూపడం లేదు. అధికారం దక్కకున్నా పర్వాలేదు కాని పార్టీ ఆమె చేతికి వెళ్లవద్దు అనేది వారిద్దరి అభిప్రాయం. మరి షా సూచనతో వారు ఏమైనా మారేనా చూడాలి.