Advertisement

అమితాబ్ బచ్చన్ భావోద్వేగం.. మధుర జ్ఞాపకం చెదిరినందుకే..

Posted : July 5, 2020 at 11:26 pm IST by ManaTeluguMovies

మనిషి జీవితమే ఓ జ్ఞాపకాల పొదరిల్లు. సృష్టిలో మనిషికి మాత్రమే ఉన్న సంతోషం, బాధ, ఆనందం, విషాదం.. వంటివి ఈ జ్ఞాపకాల్లో మరింత ఎక్కువగా ఉంటాయి. బాలీవుడ్ బిగ్ బీకి కూడా ఇప్పుడో సంఘటన తన జ్ఞపకాలను గుర్తుకు తెచ్చింది. ఎన్నో ఆనందమయ క్షణాలను పంచిన ఆ జ్ఞాపకం ఇప్పుడు ఆయన మదిలో విషాదం నింపింది.

ముంబయ్ లో అమితాబ్ ఉండే నివాసం ‘ప్రతీక్ష’. అక్కడి పెరట్లో ఆయన ఎంతో ప్రేమగా పెంచుకున్న చెట్టు ‘గుల్ మెహర్’ ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఆ చెట్టు కూలిపోవడం బచ్చన్ తీవ్రంగా కలచివేసింది. ఆ చెట్టుతో పెనవేసుకున్న తన అనుబంధాన్ని అక్షరాల రూపంలో తన భావోద్వేగాన్ని పంచుకున్నారు.

‘మా కుటుంబంతో 43ఏళ్ల అనుబంధం ఉన్న గుల్ మెహర్ చెట్టు ఇన్నేళ్లు మాకు ఎన్నో సేవలందించి నేడు స్వచ్ఛందంగా తలవాల్చింది. ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు నాటిన మొక్క.. చెట్టుగా మారి మాకు ఆనందాన్ని పంచింది. మాఇంట్లో ఏ పండుగ, శుభకార్యం, వేడుకలన్నీ ఆ చెట్టు కిందే జరిగాయి. అమితాబ్ – ఐశ్వర్య పెళ్లి కూడా ఆ చెట్టు కిందే జరిగింది. మా పిల్లలు కూడా ఆ చెట్టు నీడలోనే ఆడుకుని పెరిగి పెద్దవాళ్లయ్యారు.

ఇంతటి అనుబంధాన్ని మాతో పెనవేసుకున్న ఆ చెట్టు ఈరోజు నేలకొరగడం మనసును ఎంతో బాధ కలిగిస్తోంది’ అని తన ఆవేదన పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టుకి నెటిజన్ల నుంచి బచ్చన్ ఆత్మీయ పలకరింపు వస్తోంది. అమితాబ్ తండ్రి, ప్రముఖ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన ఓ కవిత పేరు ‘ప్రతీక్ష’. అదే పేరును అమితాబ్ తన నివాసానికి పెట్టుకున్నారు.


Advertisement

Recent Random Post:

Highlights of India’s Biggest Trailer Launch Event | Pushpa 2 The Rule | Allu Arjun | Rashmika | DSP

Posted : November 21, 2024 at 1:04 pm IST by ManaTeluguMovies

Highlights of India’s Biggest Trailer Launch Event | Pushpa 2 The Rule | Allu Arjun | Rashmika | DSP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad