సెలబ్రెటీలు ఇంటి నుంచి జనారణ్యంలోకి వస్తే జనాలు చుట్టుముట్టేస్తారు. ఫొటోలు ఆటోగ్రాఫ్ లు సెల్ఫీలంటూ హీరో హీరోయిన్ల మీద పడుతారు. అందుకే సినీ సెలబ్రెటీలు అంతా తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లినప్పుడు ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండటానికి ఎల్లప్పుడూ గట్టి భద్రత కలిగి ఉంటారు. కొంతమంది స్టార్ హీరోలు అయితే ఏకంగా సొంతంగా బాడీగార్డ్ లను పెట్టుకుంటారు. వారు సంవత్సరాలుగా తమ హీరోలు హీరోయిన్లకు సేవ చేస్తారు.
బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ కు సైతం చాలా రోజులుగా వెన్నంటి ఉండే ఒక బాడీగార్డ్ ఉన్నాడు. అతడికి భారీగానే ముట్టచెబుతాడట.. సాధారణంగా ఒక బాడీ గార్డ్ జీతం గరిష్టంగా ఎంత ఉంటుంది? మహా అయితే నెలకు రూ.లక్ష రెండు లక్షల వరకూ ఉంటుంది.
కానీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బాడీ గార్డ్ ‘జితేంద్ర షిండే’ జీతం ఎంతో తెలుసా? ఏడాదికి రూ.1.5 కోట్లు. అంటే నెలకు రూ.13 లక్షలన్నమాట..
అమితాబ్ కోవిడ్-19 సోకి ఆస్పత్రికి చేరినప్పుడు.. ఆయనకు అస్వస్థత సమయంలోనూ జితేంద్ర చాలా దగ్గరుండి మరీ చూసుకున్నట్లు తెలిసింది. అతడు పీపీఈ కిట్ ధరించి మరీ కరోనా సోకిన అమితాబ్ ను ఆస్పత్రికి తీసుకెళ్లాడట..అలా ప్రాణాలకు తెగించి మరీ అమితాబ్ ను కంటికి రెప్పలా కాపాడుతాడట.. అందుకే అతడి కోసం అమితాబ్ అంత జీతం చెల్లిస్తున్నాడట..
అమితాబ్ ఎప్పుడు బయటకు వచ్చినా ఆయనతోపాటు తన వ్యక్తిగత బాడీ గార్డ్ జితేంద్ర షిండే కూడా తోడుగా నీడలా ఉంటాడు. మనదేశంతోపాటు విదేశాల్లోనూ అమితాబ్ బాగోగులు జితేంద్ర చూసుకుంటాడు. అంత కేరింగ్ గా ఉంటాడు కాబట్టే అమితాబ్ అంతలా జీతం ఇస్తున్నాడట.. అదీ సంగతి మరీ..