థియేటర్లు ఎప్పటికి స్టార్ట్ అవుతాయో తెలియని పరిస్థితుల్లో ఆర్థిక భారం మోయలేని నిర్మాతలు ఓటిటీ వేదిక ద్వారా తమ సినిమాలు విడుదల చేసేస్తున్నారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల నుంచి తొలి డిజిటల్ రిలీజ్ జరిగిపోయింది. తెలుగు నుంచి అమృతరామమ్ సినిమా వస్తే, తమిళం నుంచి ఆర్.కే. నగర్ రిలీజ్ అయ్యాయి. డిజిటల్ డెబ్యూ జరిగిపోయిందని సంబరపడడమే కానీ ఈ రెండు చిత్రాలూ తుస్సుమన్నాయి.
ఫ్రీగా కూడా చూడడం దండగ అన్నట్టున్న సినిమాల కోసం ప్రత్యేకించి సుబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మాత్రం ఎవరూ ముందుకు రారు. ఆల్రెడీ ఆయా ఓటిటీలకు సబ్స్క్రయిబ్ అయిన వాళ్ళు మాత్రం ఈ కొత్త సినిమాలో ఏముందని కాసేపు చుడొచ్చేమో కానీ లేదంటే ఈ డిజిటల్ రిలీజ్ లు నామ్ కే వాస్తే అనిపిస్తాయంతే. అందుకే ఓటిటీ సంస్థలు కూడా పేరున్న నటీనటులు నటించిన సినిమాల హక్కుల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అనుష్క నిశబ్దం చిత్రం ఓటిటీలో రిలీజ్ అవుతుందని బాగా ప్రచారం జరుగుతోంది.