జబర్దస్త్ యాంకర్ అనసూయ బుల్లి తెర మరియు వెండి తెరపై ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నా కూడా జబర్దస్త్ ను మాత్రం వదిలి పెట్టడం లేదు. సమయానుసారం ఆమెపై కమెడియన్స్ వేసే పంచ్ లతో ఆమె ఎప్పటికప్పుడు ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ కు అంతా కూడా ఫిదా అవుతూ ఉంటారు. మద్య మద్యలో ఆమె వేసే పంచ్ లు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. కమెడియన్స్ ఆమెపై పంచ్ లు వేసినా కూడా లైట్ తీసుకుంటుంది.
కొత్త సంవత్సరం సందర్బంగా ఢీ మరియు జబర్దస్త్ కు చెందిన వారు ఒక ప్రత్యేక షో ను చేశారు. అందులో రాఘవ కామెడీ స్కిట్ చేస్తూ నేను కామెడీ చేస్తే నవ్వదు అంటూ అనసూయపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాగిన వాడిలా మారిన రాఘవ నా కామెడీకి నవ్వని అనసూయను చంపేస్తానంటూ రెచ్చి పోయాడు .అతడి హడావుడి చూసి అనసూయ భయపడింది. ఇది నిజంగా రాఘవ కు ఉన్న ఫీలింగ్ అయ్యి ఉంటుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అనసూయకు నవ్వు వచ్చేది కేవలం ఆది స్కిట్స్ సమయంలోనే అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.