Advertisement

అనసూయ ఆస్తుల చిట్టా వివరాలు తెలిస్తే షాకవ్వాల్సిందే

Posted : January 27, 2021 at 11:16 pm IST by ManaTeluguMovies

జబర్దస్త్ యాంకర్ గా తన కెరీర్ ను టర్న్ తిప్పుకున్న అనసూయ అక్కడి నుండి వెనుతిరిగి చూసింది లేదు. జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ నుండి అనసూయ సినిమా ఆఫర్లను సైతం సొంతం చేసుకుంది. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ అక్కడ కూడా తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంటోంది. ముఖ్యంగా క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో అనసూయ నటనకు చాలా మంచి మార్కులే పడ్డాయ్.

ఇదిలా ఉంటే ప్రస్తుతం క్రేజీ సినిమాల్లో నటిస్తోంది. రవితేజ ఖిలాడీ, కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తోంది. అలాగే సునీల్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో అనసూయ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది.

ఇక అనసూయ ఆస్తుల చిట్టా గురించి తెలిస్తే షాకవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో సుమ తర్వాత అనసూయనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తోన్న యాంకర్. ఆమెకు హైదరాబాద్ లో 8 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ఇల్లు, దాదాపు 3 కోట్ల రూపాయలు విలువ చేసే రెండు కార్లు, ఇంకా మరిన్ని ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ప్రతీ ఏటా ఆమె 2 నుండి 3 కోట్ల రూపాయల వరకూ సంపాదిస్తోందిట.


Advertisement

Recent Random Post:

హైదరాబాద్‌లో దారుణం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హ**త్య | Special Report

Posted : September 16, 2024 at 1:20 pm IST by ManaTeluguMovies

హైదరాబాద్‌లో దారుణం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హ**త్య | Special Report

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad