Advertisement

మొన్న రంగమ్మత్త.. నిన్న దాక్షాయణి.. ఇప్పుడు

Posted : February 4, 2022 at 9:58 pm IST by ManaTeluguMovies

విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంటున్నారు అనసూయ. ఓ పక్క సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద అంశాలపై స్పందిస్తూనే మరో పక్క వరుస చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారామె. `రంగస్థలం` చిత్రంతో రంగమ్మత్తగా ఎవరూ ఊహించని కీలక పాత్రలో నటించి ఔరా అనిపించింది అనసూయ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సెస్సేషన్ `పుష్ప ది రైజ్`లో దాక్షాయనిగా డిఫరెంట్ మేకోవర్ తో సర్ ప్రైజ్ చేసింది.

తాజాగా మరో షాకింగ్ పాత్రతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయడానికి రెడీ అయిపోయింది అనసూయ. ఆమె నటిస్తున్న తాజా చిత్రం `ఖిలాడీ`. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 11న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ డ్యుయెల్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో రవితేజతో పాటు అనసూయ కూడా ద్విపాత్రాభినయం చేస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది కూడా.

తాజాగా ఈ మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో పాత్రలని చిత్ర బృందం పరిచయం చేస్తోంది. శుక్రవారం అనసూయ లుక్ ఆమె క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్ ని విడుదల చేసిన మేకర్స్ ఇందులో ఆమె చంద్రకళ అనే పాత్రలో నటిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. ఈ పోస్టర్లో అనసూయ బ్లాక్ సారీలో సంప్రదాయ బద్దంగా చాలా స్మార్ట్గా కనిపిస్తోంది.

అయితే రెండవ పాత్ర కొంత భిన్నంగా పవర్ ఫుల్ గా వుండే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. మీనాక్షీ చౌదరి డింపుల్ హయాతీ హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ మలయాళ నటుడు ఉన్నిముకుందన్ ముఖేష్ రుషీ నికితిన్ ధీర్ సచిన్ ఖేడేకర్ ఠాకూర్ అనూప్ సింగ్ రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ మూవీస్ సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

AP Politics : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో TDP కి భారీ షాక్ | Chittoor

Posted : April 22, 2024 at 6:17 pm IST by ManaTeluguMovies

AP Politics : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో TDP కి భారీ షాక్ | Chittoor

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement