Advertisement

వివాదంలో యాంకర్ ప్రదీప్..! కలకలం రేపిన వ్యాఖ్యలు..

Posted : June 21, 2021 at 11:27 am IST by ManaTeluguMovies

యాంకర్ ప్రదీప్ మాచిరాజు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. టీవీ వ్యాఖ్యతగా ఒక్కోసారి నోరు జారితే వివాదాల్లో ఇరుక్కోవడం ఆయనకు కొత్తేమీ కాదు. గతంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా పట్టుబడి వివాదంలో చిక్కుకున్నాడు. అయితే.. ఇప్పుడు విధానపరంగా కోర్టుల్లో ఉన్న అంశంపై వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్నాడు. ఓషోలో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని ‘విశాఖపట్నం’ అంటూ ఓ వ్యాఖ్య చేశాడు. దీంతో ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోర్టుల్లో ఉన్న అంశంపై ప్రదీప్ ఎలా మట్లాడతాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రదీప్ తన వ్యాఖ్యను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ప్రదీప్ క్షమాపణ చెప్పకపోతే హైదరాబాద్ లోని ఆయన ఇంటిని ముట్టడిస్తామంటూ ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రదీప్ వ్యాఖ్యలు ప్రజలు, రైతుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదీప్ స్పందించకపోతే బుద్ధి చెప్తామని అన్నారు.


Advertisement

Recent Random Post:

Bhairathi Ranagal Official Trailer | DR.Shiva Rajkumar|GeethaSRK|Narthan|Ravi Basrur|Rukmini Vasanth

Posted : November 6, 2024 at 2:46 pm IST by ManaTeluguMovies

Bhairathi Ranagal Official Trailer | DR.Shiva Rajkumar|GeethaSRK|Narthan|Ravi Basrur|Rukmini Vasanth

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad