Advertisement

సుమ, వంటలక్క కలిసి మొదటి సారి..!

Posted : January 22, 2021 at 4:32 pm IST by ManaTeluguMovies

యాంకర్‌ గా లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్ ను సుమ దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. ఆమె సమయస్ఫూర్తి మరియు ఆమె మాట తీరు అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక సుమ యాంకర్‌ గా ఎంత ఫేమస్ అయ్యిందో అంతే కార్తీక దీపం సీరియల్‌ తో ప్రేమి విశ్వనాథ్ అంత ఫేమస్ అయ్యింది. ప్రతి ఇంట్లో కూడా దీప లేదా వంటలక్క అంటూ అందరు కూడా ఆమెను పిలుస్తూ ఉంటారు. అలాంటి ఇద్దరు లేడీ సూపర్‌ స్టార్స్ ఒక్క స్క్రీన్ మీద సింగిల్ ఫ్రేమ్‌ లో కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బుల్లి తెరపై సెన్షేషనల్‌ సక్సెస్ ను దక్కించుకున్న వీరిద్దరు కలిసి బుల్లి తెర కమర్షియల్‌ లో నటించేందుకు సిద్దం అవుతున్నారు. ఒక బ్రాండ్ కు సంబంధించిన యాడ్‌ లో వీరిద్దరు కలిసి నటించారు. వీరు ఇప్పటి వరకు కొన్ని షోల్లో కనిపించారు. కాని కలిసి నటించడం మాత్రం మొదటి సారి. సుమ కమర్షియల్స్ చాలానే చేసింది. కాని వంటలక్క మాత్రం మొదటి సారి చేస్తుంది. ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. ముందు ముందు వీరిద్దరి కాంబోలో ఇంకా ఏమైనా వస్తాయా అనేది చూడాలి.


Advertisement

Recent Random Post:

Dy CM Pawan Kalyan Visits Tirumala | Pawan Kalyan Had Tirumala Srivari Anna Prasadam

Posted : October 2, 2024 at 2:27 pm IST by ManaTeluguMovies

Dy CM Pawan Kalyan Visits Tirumala | Pawan Kalyan Had Tirumala Srivari Anna Prasadam

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad