Advertisement

చికాగోలో యాంకర్ సుమకు సన్మానం..

Posted : March 16, 2021 at 8:43 pm IST by ManaTeluguMovies

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చికాగోలోని ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) యాంకర్‌ సుమను ఘనంగా సన్మానించారు. ‘సుమతో సందడి’ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించారు. మూడు గంటల పాటు.. రెండు వందల మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మహిళలు తమలోని సృజనాత్మకతను చూపారు.

ప్రశ్నలు-సమాధానాలు అనే పోటీ కార్యక్రమాన్ని సుమ తనదైన శైలితో, సమస్ఫూర్తితో రక్తికట్టించారు. ఈ సందర్భంగా ట్రై-స్టేట్ అసోసియేషన్ తెలుగు ప్రజల తరఫున సుమకు ‘సకల కళాభినేత్రి’ బిరుదుతో సత్కరించారు. ‘అరవై నాలుగు కళల్లో వినోదం ఒక కళ.. కానీ వినోదం అందించడంలో సుమ అరవై నాలుగు కళలను ప్రదర్శిస్తారు. ఆమెకు ఈ బిరుదు ఇవ్వటాన్ని గౌరవంగా భావిస్తున్నాం’ అని సంస్థ సమన్వయకర్త ప్రణతి కలిగోట్ల అన్నారు.


Advertisement

Recent Random Post:

SIB Ex Chief Prabhakar Rao Responds First Time on Phone Tapping Issue | KCR

Posted : May 8, 2024 at 7:37 pm IST by ManaTeluguMovies

SIB Ex Chief Prabhakar Rao Responds First Time on Phone Tapping Issue | KCR

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement