Advertisement

వీడియో : జయమ్మకు తృటిలో తప్పిన ప్రమాదం

Posted : May 7, 2022 at 6:48 pm IST by ManaTeluguMovies

యాంకర్ సుమ జయమ్మ పంచాయితీ తో నటిగా మరోసారి తన అదృష్టంను వెండి తెరపై పరీక్షించుకుంది. చాలా రోజులుగా అన్ని మీడియాల్లో కూడా జయమ్మ పంచాయితీ సినిమా హడావుడి ఓ రేంజ్ చేయడం జరిగింది. సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల తర్వాత కూడా సుమ ప్రమోషన్ ను ఆపడం లేదు. తాజాగా సినిమా కోసం తాము పడ్డ కష్టంను తెలియజేసే ఒక వీడియోను షేర్ చేసింది.

వీడియో లో సుమ ఒక అడవి వంటి ప్రదేశంలో.. నీరు ప్రవహించే రాళ్ల ప్రాంతంలో షూటింగ్ జరుపుతున్నట్లుగా ఉంది. షూటింగ్ లో భాగంగా రాళ్లను పట్టుకుని ఏదో ఆలోచిస్తూ సుమ ఉన్నారు.

ఆసమయంలోనే అక్కడ నీటి ప్రవాహంతో ఏర్పడిన నాచు వల్ల జారి పడ్డారు. దాంతో ఒక్కసారి ఆమె జారి కిందకు పడి పోతారేమో అనే భయంతో స్టాఫ్ మరియు యూనిట్ సభ్యులు అంతా ఆమె వైపు పరిగెత్తారు.

సుమ వీడియోను షేర్ చేసి తృటిలో తప్పిన ప్రమాదం అన్నట్లుగా కామెంట్ పెట్టింది. సోషల్ మీడియాలో ఈ వీడియో గురించి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. జాగ్రత్త సుమక్క అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు అందుకే నీకు సినిమాలు వద్దన్నది.. హాయిగా స్టూడియోలో స్టార్ మహిళ కార్యక్రమం చేసుకోక ఎందుకు ఈ బాధలు అంటూ ఆమెకు అయ్యో పాపం అంటూ సానుభూతి చూపిస్తున్నారు.

సుమ నటిగా చేయాలని చాలా కాలంగా కొందరు ఆమె అభిమానులు మరియు శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. వారందరి కోసం జయమ్మ పంచాయితీ చేసిన సుమ తనలో ఉన్న నటిని కూడా సంతృప్తి పర్చుకున్నట్లు అయ్యింది. సుమ జయమ్మ పంచాయితీ తర్వాత సినిమాలు చేస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

సినిమా తర్వాత కూడా ఆమె హోస్ట్ గా చేస్తుందనే నమ్మకం మాత్రం అందరిలో ఉంది. ఆమె మరో పదేళ్ల పాటు బుల్లి తెరపై నెం.1 యాంకర్ గా కొనసాగడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో నటించే విషయమై క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.


Advertisement

Recent Random Post:

Suma Adda Promo -19th November 2024 -Nithya,Viya,Ravi,Masuma,Amaira,Ali Reza – #SumaAdda100thEpisode

Posted : November 18, 2024 at 1:59 pm IST by ManaTeluguMovies

Suma Adda Promo -19th November 2024 -Nithya,Viya,Ravi,Masuma,Amaira,Ali Reza – #SumaAdda100thEpisode

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad