Advertisement

నా సినిమాకు రివ్యూలు ఎందుకు రాయలేదు: యాంకర్ సుమ

Posted : May 7, 2022 at 10:36 pm IST by ManaTeluguMovies

ప్రముఖ యాంకర్ టీవీ హోస్ట్ సుమ కనకాల నటించిన తాజా చిత్రం ”జయమ్మ పంచాయతీ”. చాలా కాలం తర్వాత ఆమె వెండితెరపై పూర్తి నిడివి పాత్రలో కనిపించిన సినిమా ఇది. ప్రచార కార్యక్రమాలతో సందడి చేసిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మరియు ‘భళా తందానాన’ వంటి రెండు సినిమాలకు పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగింది. అయితే విశ్వక్ సేన్ – శ్రీవిష్ణు సినిమాలతో పోల్చుకుంటే సుమ సినిమా ఆశించిన స్పందన రాబట్టలేకపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ‘జయమ్మ పంచాయితీ’ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రాన్ని మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. మెజారిటీ వెబ్ మీడియాలు రివ్యూలు కూడా రాయలేదు. అయితే తాజాగా ఏర్పాటు చేసిన మీడియా ఇంటరాక్షన్ లో ఇదే విషయంపై యాంకర్ కమ్ యాక్ట్రెస్ సుమ ఫన్నీగా స్పందించింది. ఎన్నో ఏళ్లుగా పరిచయమున్నా.. తన సినిమాకు రివ్యూలు ఎందుకు రాయలేదని ప్రశ్నించిన సుమ.. ప్రెస్ వాళ్ళతో కలిసి అసలు పంచాయితీ పెట్టాలని అనుకున్నానని తమాషా చేసింది.

‘మేం మంచి సినిమానే చేశాం కదా..’ అని సుమ అంటుండగా.. పక్కనే ఉన్న వ్యక్తి చెవిలో ఏదో చెప్పబోయాడు. దీనికి సుమ రియాక్ట్ అవుతూ..’నువ్ నా చెవిలో ఊదకు. నాకు తెలుసు ఏం మాట్లాడాలో. నాకే చెప్తావా నువ్వు. పక్కకి వెళ్ళు అసలు’ అంటూ తనదైన శైలిలో మాట్లాడి నవ్వులు పూయించింది. అదే సమయంలో ఆమె చేతికి మైక్ అందించగా.. ‘అందరికీ నమస్కారమండీ.. బాగున్నారా’ అంటూ ఫార్మల్ గా మాట్లాడటంతో ప్రెస్ మీట్ లో అందరూ పగలబడి నవ్వారు.

నిజానికి ‘జయమ్మ పంచాయితీ’ చిత్రాన్ని అన్నీ తానై ముందుకు నడిపించింది సుమ. సినిమా కోసం మరియు ప్రమోషన్స్ కోసం ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుంది. ఎంఎం కీరవాణి వంటి స్టార్ మ్యూజిక్ కంపోజర్ తో పాటలు రాబట్టుకుంది. ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ ను హీరో రామ్ చరణ్ ఆవిష్కరించగా.. ట్రైలర్ ను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. రిలీజ్ ట్రైలర్ ను మహేష్ బాబు చేత లాంచ్ చేయించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అక్కినేని నాగార్జున – నాని లను ముఖ్య అతిధులుగా తీసుకొచ్చింది.

టాలీవుడ్ బిగ్ స్టార్స్ తో సినిమాను ప్రమోట్ చేసినా ‘జయమ్మ పంచాయితీ’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విఫలమైంది. సుమ కష్టానికి తగిన ఫలితం దక్కలేదనే అనుకోవాలి. తెలుగు ప్రేక్షకులకు సుమ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బుల్లితెర ద్వారా ప్రతి తెలుగు ఇంటిలో ఆమె ఒక భాగమైంది అనడంలో అతిశయోక్తి లేదు.

‘జయమ్మ పంచాయితీ’ చిత్రానికి విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు. విజయ లక్ష్మీ సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించారు. అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేసారు. ధను అంధ్లూరి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.


Advertisement

Recent Random Post:

TCS, Infosys, Wipro Sacked 64,000 IT Employees | Tech layoffs 2024

Posted : April 21, 2024 at 7:28 pm IST by ManaTeluguMovies

TCS, Infosys, Wipro Sacked 64,000 IT Employees | Tech layoffs 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement