Advertisement

కరోనా దెబ్బ అనిల్ రావిపూడిపై గట్టిగానే పడింది

Posted : April 30, 2020 at 6:06 pm IST by ManaTeluguMovies

అనిల్ రావిపూడి టాలీవుడ్ లో విజయవంతమైన దర్శకులలో ఒకరు. ఇప్పటికి ఐదు సినిమాలకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి, అన్ని సినిమాలతో హిట్స్ అందుకోవడం విశేషం. తన లాస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు, కెరీర్ లోనే చాలా స్పెషల్ చిత్రం. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో పనిచేసే ఛాన్స్ దొరకడమే కాదు దాన్ని విజయవంతం చేసి చూపించాడు అనిల్ రావిపూడి. అయితే ఈ దర్శకుడు హిట్స్ అందుకుంటాడు అలాగే చాలా వేగంగా సినిమాలు కూడా చేస్తాడు. కెరీర్ లో పెద్దగా గ్యాప్ తీసుకోవడం నచ్చదు. అలాంటిది కరోనా కారణంగా అనిల్ రావిపూడి కెరీర్ కు భారీ గ్యాప్ రానుంది.

ఎఫ్ 2 సినిమా విడుదల సమయంలోనే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు అనిల్ రావిపూడి. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఎఫ్ 2 భారీ విజయం సాధించడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి కూడా సరిలేరు సూపర్ సక్సెస్ తర్వాత ఎఫ్ 3 స్క్రిప్ట్ పైనే వర్క్ చేస్తున్నాడు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో సినిమాను మొదలుపెట్టి చకచకా షూటింగ్ ను పూర్తి చేసి 2021 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావించాడు.

అయితే ఇప్పుడు కరోనా కారణంగా షూటింగ్ లకు బ్రేక్ పడిన విషయం తెల్సిందే. ప్రస్తుతం వెంకటేష్ నారప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్స్ మధ్య ఆగిపోవడంతో దాని ప్రభావం అనిల్ రావిపూడిపై పడింది. దీంతో ఎఫ్ 3 వచ్చే ఏడాదే మొదలుపెట్టే అవకాశముంది. 2022 సంక్రాంతికి ఈ సినిమా రావొచ్చు.


Advertisement

Recent Random Post:

Patang – Official Teaser | Vamsi Pujit | Preethi Pagadala | Pranav Kaushik | Praneeth Prattipati

Posted : May 2, 2024 at 8:27 pm IST by ManaTeluguMovies

Patang – Official Teaser | Vamsi Pujit | Preethi Pagadala | Pranav Kaushik | Praneeth Prattipati

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement