టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిన్న మొన్ననే ప్రేమలో పడ్డట్లుగా అనిపించింది. మద్యలో వారు బ్రేకప్ అవ్వడం మళ్లీ కలవడం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం అన్ని కూడా చకచక జరిగి పోయాయి. ప్రస్తుతం ఈ జంట ప్రేమకు చిహ్నం అన్నట్లుగా కూతురు పుట్టింది. మూడు వారాల క్రితం కూతురుకు జన్మనిచ్చిన విరుష్క దంపతులు తాజాగా ఆ పాపకు నామకరనం చేశారు.
తమ ఇద్దరి పేర్లు కలిసేలా ఆ పాపకు ‘వమిక’ అనే పేరును పెట్టారు. మేము ఇద్దరం ప్రేమతో కలిసి జీవిస్తున్నాం. మా జీవితంలో కొత్తగా అడుగు పెట్టి మా సంతోషాలను రెట్టింపు చేసింది వమిక. మా కన్నీరు, నవ్వు, ఆందోళన ఇలా అన్ని కూడా మాకు విభిన్నమైన అనుభవాన్ని ఇస్తున్నాయని ఈ సందర్బంగా అనుష్క శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పటి వరకు కూతురు ఫొటోను ఈ జంట అధికారింగా అయితే విడుదల చేయలేదు. పేరును ప్రకటించిన సమయంలో కూడా కూతురు తల బాగం కనిపించేలా మాత్రమే ఫొటోకు ఫోజ్ ఇచ్చారు. కూతురును చూసుకుంటూ చాలా సంతోషంగా వారిద్దరు గడుపుతున్నారు.