Advertisement

సూపర్ స్టార్‌ సినిమాలో కనిపించబోతున్న సంగీత సామ్రాట్

Posted : March 22, 2021 at 12:03 pm IST by ManaTeluguMovies

సంగీత సామ్రాట్‌, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహమాన్ ఇప్పటి వరకు సినిమాలో వినిపించారు. ఆయన స్వరాలు అందించిన సినిమాలు ఎన్నో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్నాయి. ఆయన స్వరపర్చిన పాటలు వేల కొద్ది అభిమానులను ఎంటర్‌ టైన్‌ చేస్తున్నాయి. అయితే ఆయన మాత్రం వెండి తెరపై కనిపించిందే లేదు. మొదటి సారి ఒక కీలక పాత్రలో రహమాన్ నటించేందుకు సిద్దం అయ్యాడు. మలయాళంలో ఈయన సినిమాను చేయబోతున్నాడు. అధికారికంగా ఈ విషయం వెళ్లడి అయ్యింది.

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్ హీరోగా ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ‘ఆరాట్టు’ చిత్రంలో కీలకమైన గెస్ట్‌ రోల్‌ లో ఏఆర్‌ రహమాన్ కనిపించబోతున్నాడు. రహమాన్ తో తీసుకున్న ఫొటోను సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ సందర్బంగా ఆయన అరుదైనది ఎప్పటికి గుర్తుండి పోయేది అంటూ ఈ ఫొటోకి కామెంట్‌ పెట్టాడు. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలు మరింత పెరిగేలా రహమాన్ నటిస్తున్నాడు. మరి వెండి తెరపై రహమాన్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.


Advertisement

Recent Random Post:

Rangareddy : రిచ్‌మండ్ విల్లాస్‌లో రూ.1.87 కోట్లు పలికిన లడ్డూ

Posted : September 17, 2024 at 1:49 pm IST by ManaTeluguMovies

Rangareddy : రిచ్‌మండ్ విల్లాస్‌లో రూ.1.87 కోట్లు పలికిన లడ్డూ

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad