Advertisement

ఎంజీఆర్ గా నాలుగు షేడ్స్ లో కనిపిస్తాను!-అరవింద స్వామి

Posted : September 8, 2021 at 9:36 pm IST by ManaTeluguMovies

అగ్ర కథానాయిక… దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం `తలైవి`. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్- జయలలిత పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. తలైవి సినిమాను తమిళ్- తెలుగు- హిందీ భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. విబ్రి మీడియా- కర్మ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విశాల్ విఠల్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. సెప్టెంబర్ 10న సినిమా విడుదల అవుతున్న సందర్భంగా అరవింద్ స్వామి మీడియాతో ముచ్చటించారు.

ఎంజీఆర్ అంటే అందరికీ ఓ లెజెండ్. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. సినీ రాజకీయాల్లో ఆయన ఎన్నో విజయాలు సాధించారు. ప్రజల అభిమానాన్ని పొందారు. ఆయన పాత్రను పోషించడం బాధ్యతగా ఫీలయ్యాను. విజయ్ సర్ నాకు ఆ పాత్రను ఆఫర్ చేశారు. ఆ పాత్రను పోషించడం చాలెజింగ్ అనిపించింది.. అందుకే తలైవి సినిమాను చేశాను.

ఎంజీఆర్ పాత్రను పోషించడం బాధ్యత అనుకున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆయన్ను ఎంతో మంది ప్రజలు అభిమానిస్తున్నారు. ఏ తప్పు కూడా చేయకూడదు. ఇమిటేట్ చేస్తూ నటించడం మామూలు విషయం కాదు. ఆయన జీవితాన్ని కూడా అర్థం చేసుకోవాలి. స్క్రిప్ట్ లోని ఎమోషన్ కు కనెక్ట్ అవ్వాలి. బాడీ లాంగ్వేజ్ ను పట్టుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.

బయట జరిగిన విషయాలకు రిఫరెన్స్ ఉంటుంది. కానీ పర్సనల్ విషయాల గురించి ఎవ్వరికీ తెలియవు. ఇందులో దాదాపు అలాంటి సీన్లే ఉంటాయి. ఒకరిద్దరి మధ్యే జరుగుతుంది. అది బయట వారికి తెలియదు. కానీ పాత్రలోని ఎమోషన్ ను పట్టుకుంటేనే ఆ సీన్లు చేయగలం. సినిమాల్లోని ఆయన మ్యానరిజం వేరు.. పర్సనల్ లైఫ్ లోని మ్యానరిజం వేరు. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది.

తలైవి సినిమాలో ఎవ్వరి గురించి నెగెటివ్ చెప్పలేదు. కొన్ని రాజకీయ ఘటనలు జరిగాయి. కానీ వెనుకున్న నేపథ్యాన్ని ఇందులో చూపించారు. ఒకరు మంచి ఇంకొరు చెడు అని చూపించడం లేదు. రాజకీయాల్లో కొందరు స్నేహితులు శత్రువులుంటారు. వారి జీవితాలు అంతర్లీనంగా కనెక్ట్ అయి ఉంటాయి. ఇందులో వారి మానవీయ కోణాలను టచ్ చేశారు.

ఎంజీఆర్ మనకు ఎన్నో రూపాల్లో కనిపించారు. సినిమాల్లో ఒకలా.. ఆరోగ్యం బాగా లేని సమయంలో మరోలా.. రాజకీయాల్లోకి వచ్చాక ఇంకోలా కనిపించారు. నటనల్లోనూ ఎన్నో రకాల పాత్రలను చేశారు. అందుకే ఈ సినిమాలో ఎంజీఆర్ కెరీర్ ను నాలుగు దశలుగా విభజించారు. ఈ చిత్రంలో ఎంజీఆర్ గా నాలుగు షేడ్స్ లో కనిపించాను. నేను ఎప్పుడూ కూడా ఎంజీఆర్ తో పోల్చుకోను. పైగా నేను ఆయనకు అభిమానిని. నేను ఓ ప్రయత్నం చేశాను అంతే. నేను ఎంజీఆర్ ను కాను. నేను ఓ నటుడ్ని. నా పేరు అరవింద్ స్వామి. ఆయనలా నటించేందు ప్రయత్నిస్తున్నాను. నా వరకు నేను వంద శాతం ఎఫర్ట్ పెట్టి ప్రయత్నిస్తాను. తలైవి సినిమాలో కంగనా- నాజర్- సముద్రఖని ఇలా చాలా మంది గొప్ప నటులున్నారు. అలాంటి వారి మధ్య సీన్లు పడితే అవి కచ్చితంగా ఇంకా ఎలివేట్ అవుతాయి. అందరి పర్ఫామెన్స్ బాగుంటుంది. ఇదొక మంచి అనుభవం.

ప్రిపేర్ అవ్వడం వేరు.. సెట్ మీద వెళ్లి నటించడం వేరు.. నేను ఎంత బాగా ప్రిపేర్ అయినా కూడా సినిమాను జనాలు చూడరు.. సినిమాలో బాగా చేస్తేనే చూస్తారు. అందుకే నేను అలా కష్టపడ్డాను ఇలా కష్టపడ్డాను అని అంటే కుదరదు. ఆ పాత్రను నేను ఎంతా బాగా చేశాను అని చూస్తాను తప్పా.. ఆ పాత్ర కోసం ఎంత కష్టపడ్డాను అనేది చూడను.

థియేటర్ల సమస్య గురించి నాకు అంతగా తెలీదు. కానీ నేను ఆల్రెడీ ఈ చిత్రాన్ని చూశాను. చాలా బాగా వచ్చింది. వీలైనంత ఎక్కువ మంది ఈ సినిమా చూడాలి. ఇది కచ్చితంగా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. కానీ అనుకోకుండా ఇలా కరోనా వచ్చింది. పరిస్థితులు మారాయి. ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లో కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. ఓటీటీలో చూసి కూడా ఎంజాయ్ చేయవచ్చు.

హైద్రాబాద్ లో నాకు చాలా మంది స్నేహితులున్నారు. షూటింగ్ లు ఇక్కడ చేయక ముందు నుంచే నాకు ఈ సిటీ తెలుసు. నాకు ఇక్కడి ఫుడ్ అంటే ఇష్టం. రోజా నుంచి ఇక్కడి ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు. ఇక్కడ నాకు ఎన్నో అద్భుతమైన మెమరీస్ ఉన్నాయి. ప్రస్తుతం అన్నీ తమిళ చిత్రాలనే చేస్తున్నాను.. అని తెలిపారు. కరోనా వల్ల ప్రాజెక్ట్ లన్నీ వాయిదా పడ్డాయి. తెలుగు ప్రాజెక్ట్ ల్లో నటించాలని అనుకున్నాను. కానీ ముందు అనుకున్న కమిట్మెంట్స్ వల్ల కుదరడం లేదు. మంచి క్యారెక్టర్ వస్తే అది చిన్నదా పెద్దదా? అని కూడా ఆలోచించడం లేదు. తెలుగులో సినిమా చేయాలని చూస్తున్నా.


Advertisement

Recent Random Post:

Aadivaaram with Star Maa Parivaaram | Chanti Sindhurala Pelli Sandadi | This Sun 11AM

Posted : November 22, 2024 at 9:11 pm IST by ManaTeluguMovies

Aadivaaram with Star Maa Parivaaram | Chanti Sindhurala Pelli Sandadi | This Sun 11AM

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad