Advertisement

త్వరలో సాధారణ విమానాలు… ఇది అఫిషియల్

Posted : May 16, 2020 at 7:07 pm IST by ManaTeluguMovies

అన్నిటితో పాటు మార్చిలో విమానా రవాణా కూడా స్తంభించిపోయింది. విమానయాన చరిత్రలో ఇదే మొదటిసారి. ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం… మళ్లీ విమానాలు తిరగనున్నాయి. కరో-నా ఇపుడు అదుపులోకి వచ్చే అవకాశం లేకపోవడంతో జాగ్రత్తలతో సర్వీసులను పునరుద్ధరించేందుకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమైపోయింది.
అయితే, మునుపటిలా ప్యాసింజర్ హక్కులు ఉండవు. ప్రయాణ నిబంధనలు అన్నీ మారిపోనున్నాయి. ఈ ఏడాది కేవలం దేశీయ విమాన సర్వీసులు మాత్రమే తిరిగే అవకాశం ఉంది. అంతర్జాజాతీయ విమాన సర్వీసులు తిరగడం అనుమానమే.
ఇక దేశీ విమాన ప్రయాణాలు చేయాలంటే కొన్ని నిబంధనలు ప్రయాణికులు తప్పక పాటించాల్సి ఉంటుంది.

వాటిలో ముఖ్యమైనవి :

ఆరోగ్య సేతు యాప్ ఉన్న వారికి మాత్రమే ప్రయాణ అనుమతి.
మాస్కులు, ఇతర రక్షణ వస్తువులు తప్పనిసరి.
ప్రతి ఒక్కరి చేతిలో శానిటైజర్ తప్పనిసరి. 350 ఎంఎల్ తగ్గకుండా.
ప్రతి ఒక్కరు ఇతర ప్యాసింజరు నుంచి 4 అడుగుల దూరం పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే సిబ్బంది ఊరుకోరు.
వెబ్ చెకిన్ కంపల్సరీ. బోర్డింగ్ పాస్ ప్రింటవుట్ తీసుకురావాలి.
సిబ్బందికి సహకరించకపోవడం చట్టరీత్యా నేరం. కరోనా కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది. అయితే ప్రయాణికులు కొన్ని నిబంధనలను పాటించాలని చెప్పింది. ప్రతి ప్రయాణికుడి వద్ద ఆరోగ్యసేతు యాప్ తప్పనిరిగా ఉండాలని తెలిపింది. ప్రయాణికుల మధ్య కనీసం నాలుగు అడుగుల దూరం ఉండాలని చెప్పింది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తెలిపింది. విమానాశ్రయానికి వచ్చే ముందే బోర్డింగ్ పాస్ ప్రింట్ తీసుకురావాలని చెప్పింది. ప్రతి ఒక్కరి వద్ద శానిటైజర్ ఉండాలని తెలిపింది. విమాన సిబ్బందికి ప్రయాణికులు పూర్తిగా సహకరించాలని సూచించింది.


Advertisement

Recent Random Post:

RGV’s Explosive Take on Johny Master’s Casting Couch Controversy | Bold Thoughts on Stalking

Posted : September 25, 2024 at 7:16 pm IST by ManaTeluguMovies

RGV’s Explosive Take on Johny Master’s Casting Couch Controversy | Bold Thoughts on Stalking

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad