తెలుగు దేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత పార్టీ నాయకులపై ఫైర్ అయ్యాడు. తెలుగు దేశం పార్టీకి చెందిన కొందరు నేతలు సంబంధం లేని నియోజక వర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలను గందరగోళంకు గురి చేస్తున్నారు. నాయకులు ఎవరిక కేటాయించిన నియోజక వర్గాలు ప్రాంతాల్లో వారే పర్యటించాలి. గ్రూపు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిచవద్దని విజ్ఞప్తి చేశాడు. ఇలాంటి పరిణామాలు పార్టీకి మంచిది కాదంటూ హెచ్చరించాడు.
గ్రూపు రాజకీయాలు చేసే ప్రయత్నాలు చేస్తున్న కొందరు తమకు సంబంధం లేని నియోజక వర్గాల్లో పర్యటిస్తున్నారు. తద్వారా గ్రూప్ రాజకీయాలు అనేవి ఏర్పడుతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి సమయంలో గ్రూప్ రాజకీయాలు మొదలు అయితే తెలుగ దేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంకు దూరంగా ఉండాల్సి వస్తుందని కొందరు హెచ్చరిస్తున్నారు.