చిన్నారి పెళ్లి కూతురు అవికా గౌర్ తెలుగు ప్రేక్షకులు ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెల్సిందే. అప్పటికే బుల్లి తెర ద్వారా పరిచయం ఉన్న అవికా సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వడంతో మంచి గుర్తింపు దక్కింది. మొదటి సినిమాతోనే రాజ్ తరుణ్ తో కలిసి ఆ సినిమా తో సక్సెస్ ను దక్కించుకుంది. దాంతో అవికా మంచి ఆఫర్లు దక్కించుకోగలిగింది. కాని ఆమెకు లక్ కలిసి రాలేదు.
అవికా హీరోయిన్ గా ఆరంభంలో హడావుడి చేసినా ఆ తర్వాత కాస్త డల్ అయ్యింది. బరువు తగ్గి మళ్లీ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడు ఎంత మేరకు సక్సెస్ అయ్యేనో చూడాలి. ఇక ఈమె సినీ కెరీర్ గురించి పక్కన పెడితే గతంలో హీరో రాజ్ తరుణ్ తో ఈమె ప్రేమ వ్యవహారం సాగించిందనే ప్రచారం జరిగింది. ఇద్దరు రెండు సినిమాలు చేశారు.. హైదరాబాద్ వచ్చిన ప్రతి సారి కూడా అవికా ఖచ్చితంగా రాజ్ తరుణ్ ను కలిసేది.
ఇద్దరి మద్య మంచి స్నేహం కాస్త ప్రేమగా మారిందనే పుకార్లు షికార్లు చేశాయి. గతంలో ఒకటి రెండు సార్లు ఇద్దరు కూడా ప్రేమ లేదు దోమ లేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా అవికా మరోసారి ఆ విషయమై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అవికా మరో వ్యక్తితో ప్రేమలో ఉంది. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సమయంలో రాజ్ తరుణ్ తో ప్రేమ వార్తలపై ఒక చిట్ చాట్ లో స్పందించింది.
అవికా గౌర్ మాట్లాడుతూ.. మేము ఇద్దరం కలిసి రెండు సినిమాలు చేసి ఫ్రెండ్లీగా ఉండటంతో అంతా కూడా మా గురించి ఇష్టానుసారంగా మాట్లాడేసుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు రాజ్ తరుణ్ మాత్రమే కాకుండా నవీన్ చంద్ర మరియు నిఖిల్ లు కూడా మంచి స్నేహితులే. కాని రాజ్ తరుణ్ నాకు హైదరాబాద్ లో ల్యాండ్ అయిన వెంటనే పరిచయం అయిన వ్యక్తి. అందుకే అతడు అంటే స్పెషల్ అంటూ అవికా వ్యాఖ్యలు చేసింది.
గత కొన్నాళ్లుగా మళ్లీ మళ్లీ వస్తున్న పుకార్లకు ఈ అమ్మడు క్లారిటీ ఇవ్వడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వీరి విషయమై పుకార్లు పుట్టించడం సోషల్ మీడియా జనాలు ఆపేస్తారేమో చూడాలి. హీరోయిన్ గా అవికా తెలుగు లో ఒక చిత్రంలో నటిస్తోందట. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెళ్లడి అయ్యే అవకాశం ఉంది. మరో వైపు అవికా ఉత్తరాదిన కూడా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది.