Advertisement

ఏనుగుపై రామ్ దేవ్ బాబా యోగా.. హఠాత్తుగా కింద పడి.. ఆ తర్వాత..

Posted : October 14, 2020 at 11:16 pm IST by ManaTeluguMovies

దేశంలో యోగా గురువుగా రామ్ దేవ్ బాబాకు పేరు. ఆయన వేసే యోగాసనాలకు ఎంతో క్రేజ్ ఉంది. ఒకరకంగా చెప్పాలంటే రామ్ దేవ్ బాబాకు సినీ స్టార్స్ కు ఉన్నంత క్రేజ్ ఉంది. దేశవ్యాప్తంగా ఆయన అనేక చోట్ల యోగాసనాలు వేస్తూ ఉంటారు. వివిధ భంగిమల్లో ఆయన చేసే యోగాను ప్రత్యక్ష్యంగా, యూట్యూబ్ వీడియోల్లో పరోక్షంగా వీక్షిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రామ్ దేవ్ బాబా మధురలో యోగాసనం వేస్తూ ప్రమాదానికి గురయ్యారు. అయితే.. ఆయన యోగాసనం వేయడానికి ఎంచుకున్న మార్గమే ఈ ప్రమాదానికి కారణమైంది.

ఈనెల 12న సోమవారం రామ్ దేవ్ ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ ఆశ్రమంలో యోగాసనాలు వేసేందుకు వెళ్లారు. అయితే.. అక్కడ ఉన్న ఏనుగు మీద ఎక్కి యోగాసనం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఏనుగుపై కూర్చుని ఆయన యోగా చేస్తున్నారు. అయితే.. ప్రమాదవశాత్తూ ఆయన ఏనుగు పైనుంచి కిందపడ్డారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

అయితే.. ఆయన కింద పడిన వెంటనే అంతే వేగంతో లేచి ముందకు నడిచారు. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఆ సమయంలో రామ్ దేవ్ ఏనుగుపై కూర్చుని పద్మాసనం వేసారు. ఈ క్రమంలో భ్రమరీ ప్రాణాయామం చేస్తుండగా ఏనుగు ఒకటి రెండు సార్లు కదిలింది. దీంతో.. ఆయన అదుపు తప్పి కిందపడ్డారు.


Advertisement

Recent Random Post:

Jr.NTR’s Awareness Video On Drugs : డ్రగ్స్ పై పోరాటానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు | Devara

Posted : September 25, 2024 at 12:40 pm IST by ManaTeluguMovies

Jr.NTR’s Awareness Video On Drugs : డ్రగ్స్ పై పోరాటానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు | Devara

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad