‘ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనేదానికి, శీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి చాలా తేడా ఉందిరా లండీ కొడకా’ అని బాలయ్య చెప్పిన డైలాగ్ తోనే నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను హ్యాట్రిక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు. దాదాపు 8 నెలల గ్యాప్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ని రీస్టార్ట్ చేశారు.
ఈ సినిమా మొదలైనప్పటి నుంచీ బాలకృష్ణ కోసం భారీగానే హీరోయిన్ వేట నడిచింది. ఫైనల్ గా సయేశా సైగల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఐదారు హీరోయిన్స్ కోసం అన్వేషణ చేస్తున్నారు. అందులో ఒకరు బాలయ్యకి జోడీ అయితే, మరొకరు బాలయ్యకి సిస్టర్ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్స్ విషయంలోనే కాదు, విలన్ విషయంలోనూ ఇంకా క్లారిటీ రాలేదు. మొదటి నుంచీ లేడీ విలన్ ఉంటది అదీ ఇదీ అనుకున్నా వేమీ సెట్ కాలేదు.
తాజాగా బాలకృష్ణని ఢీ కొట్టే విలన్ గా టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మాన్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. ఆయనే మన రాజశేఖర్. ఇటీవలే కోవిడ్ నుంచి కాస్త కోలుకొని ఇంటికి వచ్చారు. ఇంకా ఆక్సిజన్ తో, కంప్లీట్ రెస్ట్ స్టేజ్ లో ఉన్నారు రాజశేఖర్. బాలయ్యని ఢీ కొట్టే విలన్ కి రాజశేఖర్ అయితే బాగుంటుందని ఆయన్ని సంప్రదించే ఆలోచనలో ఉన్నారట.
ఇటీవలే పాత్ర నచ్చితే విలన్ పాత్రలు చేయడానికైనా సిద్ధమని రాజశేఖర్ అన్నారు. మరి ఎలాగూ బోయపాటి సినిమాల్లో విలన్ కూడా స్ట్రాంగ్ గా ఉంటారు కాబట్టి ఈ ఆఫర్ కి రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఆశిస్తున్నారు. ఫైనల్ గా బోయపాటి బాలయ్య కోసం రాజశేఖర్ ని రంగంలోకి దింపుతాడా? లేక ఇంకో ఛాయస్ కోసం వెళ్తాడా? అనేది చూద్దాం.