Advertisement

సుకుమార్ తో 3 నెలల్లో సినిమా పూర్తి చేస్తా: బాలయ్య

Posted : December 27, 2021 at 12:45 pm IST by ManaTeluguMovies

నందమూరి బాలకృష్ణ ”అఖండ” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ మీదున్న నమ్మకాన్ని నిలబెడుతూ ఈ హ్యాట్రిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. సక్సెస్ జోష్ లో ఉన్న నటసింహం.. తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు. తెలిసిందే.ఇదే క్రమంలో అనిల్ రావిపూడితో ఓ మూవీ చేయనున్నారు. అయితే సుకుమార్ తో ఒక సినిమా చేయడానికి బాలయ్య ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది.

బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ”అన్ స్టాపబుల్” టాక్ షోకి ‘పుష్ప’ టీమ్ గెస్టులుగా హాజరయ్యారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో పాటుగా హీరోహీరోయిన్లు అల్లు అర్జున్ – రష్మిక మందన్నా ఈ ప్రత్యేక కార్యక్రమంలో సందడి చేశారు. ఆహా ఓటీటీలో ఆదివారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఎపిసోడ్ విశేష స్పందన తెచ్చుకుంటోంది. ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్స్ లలో ఎంటర్టైన్మెంట్ పరంగా ఇదే బెస్ట్ అని కామెంట్స్ వస్తున్నాయి.

సుకుమార్ ని సుక్కూ అని పిలుస్తా అని బాలయ్య అడగడం.. తనదైన శైలిలో ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ చెప్పి తొడ కొట్టడం.. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరూ..’ అని చెప్పడం.. రష్మిక – సుకుమార్ లతో కలిసి ‘సామీ సామీ’ స్టెప్పులు వేయడం ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా సుకుమార్ దర్శకత్వంలో మూడు నెలల్లోనే సినిమా కంప్లీట్ చేస్తానని బాలకృష్ణ చెప్పడం అభిమానులను ఉత్సాహపరిచింది.

‘ఆరేసుకోబోయి’ ‘ఆకుచాటు పిందె తడిసే’ తరహా ఫ్యూర్ కమర్షియల్ సినిమా చేసే అవకాశం ఉందా? అని సుకుమార్ ను బాలయ్య ప్రశ్నించగా.. ‘మీరు అవకాశం ఇస్తే చేస్తా’ అని సుక్కూ నవ్వుతూ బదులిచ్చారు. దీనికి బాలయ్య స్పందిస్తూ.. ”సరే.. మూడే నెలల్లో తీసేద్దాం. మీకున్న కన్ఫ్యూజన్ కి నాకున్న క్లారిటీకి మూడు నెలల షెడ్యూల్ చాలు. మూడు నెలల్లో వెండితెర మీద బొమ్మ పడాల్సిందే.. తగ్గేదే లే” అని అన్నారు.

ఇదే క్రమంలో అల్లు అర్జున్ సమక్షంలో మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు బాలకృష్ణ. ”పుష్ప 2 అయినపోయిన తర్వాత వచ్చే ఏడాది సుక్కూ నేను కలిసి మూడే నెలల్లో ఓ సినిమా చేయబోతున్నాం. దసరాకు కొబ్బరికాయ.. క్రిస్మస్ కు గుమ్మడికాయ.. సంక్రాంతి రిలీజ్ అంతే..” అని బాలయ్య అన్నారు. దీనికి బన్నీ స్పందిస్తూ.. ‘మీ చేతిలో పడితే కానీ సుకుమార్ సెట్ అవ్వడు’ అని ఫన్నీగా అన్నారు.

ఈ మాటలు నిజమై బాలయ్య – సుక్కూ కాంబోలో ఈ సినిమా చేస్తే బాగుంటుందని నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేసిన సుకుమార్.. మరి రాబోయే రోజుల్లో నందమూరి బాలకృష్ణ తో కూడా మూవీ చేస్తారేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

Shocking Facts In Bangalore Rave Party | Hema

Posted : May 24, 2024 at 1:58 pm IST by ManaTeluguMovies

Shocking Facts In Bangalore Rave Party | Hema

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement