Advertisement

వారంలో ఈటల బీజేపీలోకి..! కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: బండి సంజయ్

Posted : June 3, 2021 at 12:14 pm IST by ManaTeluguMovies

ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే బీజేపీలో చేరతారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈటల రాజేందర్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి వారం రోజుల్లో పార్టీలో చేరు అవకాశం ఉందని ఈ సందర్భంగా అన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ తీరునూ ఎండగట్టారు. ‘కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అవినీతిలో కేసీఆర్‌ మించి అవినీతిపరుడు ఎవరూ లేరు. ఆయన అవినీతి అంశాలపై దృష్టి సారించాం. సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలు తీస్తున్నాం. ఆయన అవినీతి చిట్టా చూసి మేమే ఆశ్చర్యపోయాం. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం’ అని అన్నారు.

ఈటల బీజేపీలో చేరికపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఢిల్లీలో మంగళవారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలిసింది. ఈటల గురువారం హైదరాబాద్‌ రానున్నారని తెలుస్తోంది. శుక్ర, శనివారాల్లో ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్‌ కు రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

Suma Adda Latest Promo | Pottel Team | Noel Sean, Ananya Nagalla, Riyaz | 5th November 2024

Posted : November 1, 2024 at 6:24 pm IST by ManaTeluguMovies

Suma Adda Latest Promo | Pottel Team | Noel Sean, Ananya Nagalla, Riyaz | 5th November 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad