కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చొరవ.. ప్రెస్ మీట్లలో అద్భుతమైన విషయ పరిజ్ఞానం, వాక్చాతుర్యంతో ఆయన జనాల్ని జాగృతం చేస్తున్న తీరు ఎంతగా ప్రశంసలు అందుకుంటున్నాయో తెలిసిందే. ఇక్కడ ప్రతిపక్షాల నుంచి అసలు సౌండ్ లేదు.
పెద్దగా వివాదాలకు తావు లేకుండా అన్ని వ్యవహారాలు సాగిపోతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా లేదు. అక్కడి ప్రభుత్వ తీరు అడుగడుగునా విమర్శల పాలవుతోంది. ప్రతిపక్షాలతో రోజూ అధికార పార్టీ నాయకుల రగడ నడుస్తోంది. పరస్పరం మాటల యుద్ధాలు నడుస్తున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో జనాలకు అసహనం కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాత.. కొన్నాళ్లు రాజకీయాలు కూడా నడిపిన బండ్ల గణేష్ లైన్లోకి వచ్చాడు.
తెలంగాణలో రాజకీయ నాయకుల్ని ఉదాహరణగా చూపిస్తూ.. ఏపీ నేతలకు ట్విట్టర్లో క్లాస్ పీకాడు బండ్ల. కొన్ని రోజులుగా కేసీఆర్‌ను అదే పనిగా ఆకాశానికెత్తేస్తున్న బండ్ల.. తాజాగా మొత్తంగా తెలంగాణ నాయకులకు ఓ రేంజిలో ఎలివేషన్ ఇస్తూ ఏపీ నేతలకు హితవు పలికాడు. తెలంగాణ రాజకీయ నాయకులు చూసి కష్టకాలంలో ఎలా ఉండాలో నేర్చుకోండి ఇది రాజకీయాలకు సమయం కాదు ఇది బతుకు పోరాటం దయచేసి అర్థం చేసుకొని రాజకీయాలు చేయండి.
ఇది జీవన్మరణ పోరాటం దయచేసి రాజకీయాలు పక్కనపెట్టి దేవుడి మీద ప్రమాణాలు పక్కనపెట్టి ప్రజలను కాపాడండిటీవీలు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ప్రతి నెల ఎలక్షన్స్ వస్తాడేమో అన్న భయంతో డిబేట్లో పాల్గొన్న అనిపిస్తుంది.ఎలక్షన్లు ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తాయని ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు ప్రజలు గమనించగలరు అంటూ వరుసగా ట్వీట్లు గుప్పించి ఆసక్తికర చర్చకు తెరతీశాడు బండ్ల.