Advertisement

అక్కడ` భీమ్లానాయక్` పరిస్థితి ఏంటీ?

Posted : February 28, 2022 at 3:54 pm IST by ManaTeluguMovies

పవర్స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `భీమ్లానాయక్` ఇటీవల విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. చాలా రోజుల తరువాత పవన్ కల్యాన్ మాసీవ్ పాత్రలో నటించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ పాత్రని మలిచిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. `గబ్బర్ సింగ్` తరువాత మళ్లీ ఇన్నేళ్లకు పవన్ కల్యాణ్ అంతకు మించి అన్నట్టుగా భీమ్లానాయక్ పాత్రలో పవర్ ఫుల్ గా నటించడంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రానికి భిన్నంగా తెలుగులో మార్పులు చేసిన ఈ మూవీ అనూహ్య విజయాన్ని సాధించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతోంది.

హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ ప్రీమియర్ షోల నుంచే తన ప్రభంజనాన్ని మొదలుపెట్టింది. యూఎస్ ప్రీమియర్ ల ద్వారా భారీ మొత్తాన్ని దక్కించుకుని సంచలనం సృష్టించిన `భీమ్లానాయక్` తొలి రోజు ప్రారంభ వసూళ్ల పరంగానూ రికార్డు సృష్టించింది. తొలి రోజు రూ. 37.15 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ రెండవ రోజు 19.75 కోట్లు… మూడవ రోజు 21 క్రోర్స్ కలెక్ట్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఓవర్సీస్ లో 14. 95 క్రోర్స్ వసూలు చేసినట్టుగా వార్తలు వనిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు అందిన లెక్కల ప్రకారం ఈ మూవీ మూడు రోజులకు గానూ 77.90 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే 100 కోట్ల మార్కుని రీచ్ కావడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే యుఎస్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ని సాధించేసింది. నైజాంలోనూ రికార్డు స్థాయిలో వసూళ్లని రాబడుతూ సంచలనం సృష్టిస్తోంది. అయితే మిగతా ఏరియాల్లో పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వుందని వార్తలు వినిపిస్తున్నాయి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` చిత్రం తరువాత చేసిన సినిమా కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అందుకు అనుగునంగానే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ లభించాయి. ఫస్ట్ డే మొదటి ఆటకే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ బయటికి రావడంతో సినిమా వసూళ్ల పరంగా రికార్డులు నమోదు చేసింది. అయితే ఈ మూవీ క్రేజ్ మాత్రం అక్కడ పెద్దగా వసూళ్లని కురిపించకపోవడం గమనార్హం.

ఏపీలో టికెట్ రేట్ల సమస్య గత కొన్ని నెలలుగా భారీ చిత్రాలకు శాపంగా మారుతూ వస్తోంది. దీని వల్ల పెద్ద చిత్రాలు భారీ నష్టాలని చవిచూస్తున్న పరిస్థితి. అయితే భీమ్లా రిలీజ్కు ముందు ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో జీవోని తీసుకొస్తుందని అంతా భావించారు కానీ అది జరగలేదు. ఆ కారణంగా `భీమ్లానాయక్` ఏపీలో భారీగా నష్టాలని చివిచూడక తప్పడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణతో పోల్చుకుంటే భారీగా లాస్ అని చెబుతున్నారు. అంతే కాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియా వైడ్ గానూ భీమ్లా కు భారీ నష్టాలు తప్పవని ఓ వార్త ట్రేడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇది నిజంగా మేకర్స్ కి చేదు వార్తే అంటున్నారు.


Advertisement

Recent Random Post:

Dhee Celebrity Special 2 Promo – Grand Finale – 27th & 28th November 2024 in #Etvtelugu – VishwakSen

Posted : November 22, 2024 at 7:06 pm IST by ManaTeluguMovies

Dhee Celebrity Special 2 Promo – Grand Finale – 27th & 28th November 2024 in #Etvtelugu – VishwakSen

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad