పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన భీమ్లా నాయక్ సినిమ ను సంక్రాంతికి విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత సినిమా విడుదల వాయిదా వేశారు. ఫిబ్రవరిలో సినిమా ను విడుదల చేసేందుకు అధికారికంగా తేదీని కూడా ప్రకటించారు. కాని కరోనా థర్డ్ వేవ్ ఫిబ్రవరి మరియు మార్చి లో అధికంగా ప్రభావం ఉంటుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ సమయంలోనే భీమ్లా నాయక్ సినిమా ను తెలుగు తో పాటు తమిళం, కన్నడం మరియు హిందీ లో కూడా విడుదల చేసేందుకు గాను డబ్బింగ్ పూర్తి చేసినట్లుగా పుకార్లు షికార్లు చేయడం జరిగింది. దాంతో అంతా కూడా ఆసక్తిగా అఫిషియల్ అనౌన్స్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు భీమ్లా నాయక్ సినిమా ను తెలుగు లో కాకుండా ఇతర భాషల్లో విడుదల చేసే ఆలోచన కాని ఉద్దేశ్యం కాని లేదు అన్నట్లుగా పేర్కొన్నారు. మలయాళం సినిమాకు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే. కనుక ఇతర భాషల్లో రిలీజ్ ఉండక పోవచ్చు.