Advertisement

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 42 – అరగుండు చేయించుకున్న అమ్మ‌, మనసులో మాట చెప్పిన అభిజిత్‌

Posted : October 18, 2020 at 11:56 am IST by ManaTeluguMovies

తెలుగు బిగ్‌బాస్‌ ఆరు వారాలు పూర్తి చేసుకుంది. నిన్న నేడు వీకెండ్‌ ఎపిసోడ్స్‌ తో నాగార్జున సందడి చేస్తున్నాడు. నాగార్జున ప్రతి శనివారం ఇంటి సభ్యులకు వార్నింగ్‌ లు ఇవ్వడం మైండ్‌ వాష్‌ లు చేయడం.. కోప్పడటం వంటివి చేస్తారు. ఆ వారం మొత్తం జరిగిన సంఘటనలపై నాగార్జున మాట్లాడుతూ ఉంటాడు. ఇక నిన్నటి ఎపిసోడ్‌ లో కూడా కొందరికి సున్నితంగా వార్నింగ్‌ ఇచ్చి మరికొందరిని మెచ్చుకున్నాడు. అవినాష్, సోహెల్‌ల మద్య జరిగిన సంఘటనపై అవినాష్‌ ను మందలించిన నాగార్జున అదే సమయంలో నువ్వు ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ది హౌస్‌ అంటూ ప్రశ్నంసించాడు.

ఇక డీల్‌ నో డీల్‌ లో భాగంగా మోనాల్‌ ఆ జూట్‌ డ్రస్‌ ను తొలగించేందుకు మరొకరు ఆ ఛాలెంజ్‌ స్వీకరించాలని డీల్‌ ఇచ్చాడు. అందుకు అరియానా ముందుకు వచ్చింది. తాను ఆ జూట్‌ డ్రస్‌ ను వేసుకుంటానంటూ చెప్పింది. ఇక మరో టీమ్‌ నుండి కెప్టన్సీ కాదు ఏకంగా వచ్చే వారం సేవ్‌ అయ్యేందుకు గాను హాఫ్‌ గుండు మరియు హాఫ్‌ సేవ్‌ చేసుకోవాలన్నాడు. అందుకు అమ్మ రాజశేఖర్‌ ముందుకు వచ్చాడు. కన్నీరు పెట్టుకుని అమ్మ రాజశేఖర్‌ హాఫ్‌ సేవ్‌ చేయించుకున్నాడు. అమ్మ రాజశేఖర్‌ అలా చేయడంపై చాలా మంది కన్నీరు పెట్టుకున్నారు. ముఖ్యంగా దివి చాలా బాధపడింది.

ఆ తర్వాత ప్రతి ఒక్క ఇంటి సభ్యుడి గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అందులో ఒక్కదాన్ని తీసుకు వచ్చారు. అవినాష్‌ ది క్రూరమైన వ్యక్తిత్వం అంటూ దివి పేర్కొంది. స్నేహాన్ని వాడుకుంటున్నాడు అంటూ మెహబూబ్‌ గురించి కుమార్‌ సాయి రాశాడు. లాస్య మనసులో ఒకటి ఉంటే మరో విధంగా బయటకు ఉండి నవ్వుతూ ఉంటుందని అమ్మ రాజశేఖర్‌ రాశాడు. అభికి చాలా అహంకారం అంటూ దివి రాసింది. దివి సభ్యత లేకుండా ఇతరుల ఫీలింగ్స్ తో పని లేకుండా మాట్లాడుతుందని మోనాల్‌ రాసింది. నిజాయితీ ముసుగులో అఖిల్‌ ఉన్నాడని అభిజిత్‌ రాశాడు. మోనాల్‌ అబద్దాలు చెబుతుందని కూడా అభిజిత్‌ రాశాడు. ఇక చివరగా అమ్మ రాజశేఖర్‌ అందరిని ఏమర్చుతాడు అంటూ అభిజిత్‌ రాశాడు. మొత్తానికి అందరి గురించి అభిజిత్‌ మనసులో మాట చెప్పడంతో షో కొత్త రూపుకు మారినట్లయ్యింది.


Advertisement

Recent Random Post:

అసెంబ్లీ చరిత్రలో తొలిసారి P.A.Cకి నేడు ఓటింగ్ | Voting Today For the P.A.C

Posted : November 22, 2024 at 9:19 pm IST by ManaTeluguMovies

అసెంబ్లీ చరిత్రలో తొలిసారి P.A.Cకి నేడు ఓటింగ్ | Voting Today For the P.A.C

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad