Advertisement

బిగ్‌బాస్‌ : ఈ వారం రెండు వికెట్లు డౌన్‌

Posted : October 30, 2020 at 12:38 pm IST by ManaTeluguMovies

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 సగం రోజులను పూర్తి చేసుకుంది. రేటింగ్‌ తక్కువగా వస్తున్న నేపథ్యంలో వంద రోజులను మించి సాగించాలని నిర్వాహకులు భావించడం లేదు. అందుకే షో ను ముగించే దిశగా తీసుకు వెళ్తున్నారు అనిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం డబుల్‌ ఎలిమినేటషన్‌ ఉంటుందట. హౌస్‌ లో ప్రస్తుతం 11 మంది ఉన్నారు. నోయల్‌ అనారోగ్య కారణాలతో బయటకు వచ్చాడు. కాని ఆయన మళ్లీ లోనికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక ఈ వారంలో డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని సమాచారం అందుతోంది.

నోయల్‌ అనారోగ్య పరిస్థితుల కారణంగా హౌస్‌లోకి ఇక పూర్తిగా రాలేకుంటే ఖచ్చితంగా ఈ వీకెండ్‌ ఒక్కరే ఎలిమినేట్‌ అవుతారు. ఒక వేళ నోయల్‌ కనుక మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఇద్దరు ఎలిమినేట్‌ అవ్వాల్సి ఉందని బిగ్‌ బాస్‌ నిర్వాహకులు చెబుతున్నారు. రేపు ఏ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం వరకు నోయల్‌ బిబి హౌస్ కు చేరుకోవాల్సి ఉంటుంది. అలా చేరుకోకుంటే నోయల్‌ ఎలిమినేట్‌ అయినట్లుగానే పరిగణించవచ్చు. అప్పుడు ఒక్కరు మాత్రమే ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉంది.

ఇక ఈ వారం ఎలిమినేషన్‌ కు ఆరుగురు నామినేట్‌ అయిన విషయం తెల్సిందే. ఆరుగురిలో అఖిల్‌, అరియానా, లాస్యలు స్ట్రాంగ్‌ గా ఉన్నారు. ఈ ముగ్గురు ఇప్పటికే సేవ్‌ అయ్యారు. మోనాల్‌ ను ఎలాగూ బిగ్‌బాస్‌ సేవ్‌ చేస్తూ వస్తున్నాడు. ఇక అమ్మ రాజశేఖర్‌ మరియు మెహబూబ్‌ లు చివరి స్థానాల్లో ఉన్నారు.

డబుల్‌ ఎలిమినేషన్‌ అయితే ఈ ఇద్దరు వెళ్లి పోయే అవకాశం ఉంది… సింగిల్‌ అయితే అమ్మ రాజశేఖర్‌ ఎలిమినేషన్‌కు ఎక్కువ ఛాన్స్‌ ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెహబూబ్‌ కు చాలా వారాలుగా లక్ కలిసి వచ్చింది. కాని ఈ వారం ఆ ఛాన్స్‌ లేదు. ఇక అమ్మ రాజశేఖర్‌ చిన్న విషయానికి అలుగుతూ చిరాకు పెడుతున్నాడు. అందుకే అతడిని ఎలిమినేట్‌ చేసేయాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇద్దరు కూడా డేంజర్‌ జోన్‌లో ఉన్నారు.


Advertisement

Recent Random Post:

AP CM Jagan Election Campaign | YCP Kadapa Dist Road Show

Posted : April 30, 2024 at 5:52 pm IST by ManaTeluguMovies

AP CM Jagan Election Campaign | YCP Kadapa Dist Road Show

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement