Advertisement

బిగ్బాస్5 : సిరి షన్నూల గురించి రవి

Posted : November 18, 2021 at 5:43 pm IST by ManaTeluguMovies

బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి.. షన్నూ ల రిలేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఇద్దరికి కూడా ఇప్పటికే బయట రిలేషన్స్ ఉన్నాయి. సిరి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇక షన్నూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన దీప్తి సునైనతో రిలేషన్ లో ఉన్నాడు.

ఇద్దరు కూడా స్నేహితులుగా లోనికి వెళ్లారు. కాని పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు వారు స్నేహితులుగా కనిపించడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సిరి మరియు షన్నూల మద్య స్నేహం ను మించి ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్లు వారు ఈ విషయం గురించి మాట్లాడుకోలేదు. కాని ఇటీవల ఎపిసోడ్ లో మన ఇద్దరి రిలేషన్ బ్యాడ్ గా బయటకు వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది అనుకున్నారు. ఇద్దరం కాస్త దూరం ఉంటే బాగుంటుందని కూడా అనుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే ఉంటున్నారు.

సిరి మరియు షన్నూల మద్య కనెక్షన్ గురించి ప్రేక్షకులతో పాటు హౌస్మెంట్స్ కూడా అనుమానంగా ఉన్నారు. తాజాగా అదే విషయాన్ని రవి ప్రస్తావించాడు. ఇంతకు ముందు ఎపిసోడ్ లో షన్నూ మరియు సిరిల మద్య జరిగిన సంఘటన గురించి రవి మాట్లాడే ప్రయత్నం చేశాడు.

సిరితో రవి ఏం జరిగింది అంటూ ప్రశ్నించగా ఆ సమయంలో తప్పు నాదే అన్నట్లుగా సిరి అనేసింది. షన్నూ మాత్రం తప్పు నాది అన్నట్లుగా నాతో అన్నాడని రవి అన్నాడు. ఇద్దరి వైపు తప్పు ఉందని సిరి చెప్పుకొచ్చింది. మొత్తానికి ఇద్దరం కూడా చాలా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయినట్లుగా సిరి కూడా ఒప్పుకుంది.

షన్నూ కాస్త ట్రిప్ అవుతున్నాడు. అతడు ఎందుకు అలా ట్రిప్ అవుతున్నాడో ఆలోచించాలంటూ సిరికి సూచించాడు. నీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నా అంటూ సిరికి రవి సలహా ఇచ్చాడు. సిరి విషయంలో షన్నూ ట్రిప్ అవ్వడం చూస్తుంటే అతడు ఆమెను స్నేహితురాలి కంటే ఎక్కువగా చూస్తున్నాడేమో అనిపిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

షన్నూ మరియు సిరిల మద్య స్నేహం ను కొందరు డ్రామా అని భావించారు. కాని ఇద్దరు ఒక్కరంటే ఒకరు కనెక్ట్ అయిన తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఇద్దరు అంతకు మించి అన్నట్లుగా కనెక్ట్ అయ్యారంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ డ్రామా అయితే ఒక సమయంలో కాకున్నా మరో సమయంలో అయినా కూడా ఖచ్చితంగా బయట పడుతారు. కాని ఇద్దరు కూడా ఎప్పుడు కూడా చాలా అన్యోన్యంగా ఉంటున్నారు.

సిరి మరియు షన్నూల గురించి లోబో మాట్లాడుతూ సిరి తన భర్తకు అయినా కూడా పెడుతుందో లేదో కాని షన్నూ కు తినిపించడం నుండి అన్ని చేస్తుందని చెప్పుకొచ్చాడు. వీరిద్దరి రిలేషన్ ఆటపై ప్రభావం చూపిస్తుందని కామెంట్స్ వస్తున్నాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు వెంటనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Home Minister Anitha Reaction On Deputy CM Pawan Kalyan Comments

Posted : November 5, 2024 at 11:47 am IST by ManaTeluguMovies

Home Minister Anitha Reaction On Deputy CM Pawan Kalyan Comments

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad