Advertisement

బిగ్ బాస్ 5: సన్నీ, ప్రియాల మధ్య ముదురుతోన్న గొడవలు

Posted : October 20, 2021 at 11:40 am IST by ManaTeluguMovies

నిన్నటి నామినేషన్స్ ఎఫెక్ట్ ఈరోజు కూడా బాగా నడిచింది. నామినేషన్స్ సందర్భంలో కావాలని సన్నీను టార్గెట్ చేయడానికి ప్రియా మైండ్ గేమ్ ఆడిన విషయం తెల్సిందే. చాలా సిల్లీ కారణం చెప్పి రవిని నామినేట్ చేస్తున్నానని ప్రియా తెలపడం, ఆ నవ్వులకు సన్నీ ఇరిటేట్ అయి మీ గేమ్ మీరు ఆడారు ఇప్పుడు నా గేమ్ నేను ఆడతానని చెబుతూ రవిని నామినేట్ చేసిన విషయం తెల్సిందే. ఈ నామినేషన్ తాలూకా డిస్కషన్ చాలా సేపు నడిచింది.

మరోవైపు ప్రియాంక సింగ్ తన రీజన్ ను పక్కనపెట్టేసి, సిల్లీ రీజన్ కు రవిను నామినేట్ చేయడంపై ప్రియాంక రోజంతా ఏడుస్తూనే ఉంది. అయితే మానస్ చివరికి వచ్చి ప్రియాంకతో కాసేపు మాట్లాడి కలిపి భోజనం తినిపించడంతో ప్రియాంక కోపం చల్లారింది. తర్వాతి రోజు కెప్టెన్సీ టాస్క్ ను ప్రకటించాడు బిగ్ బాస్. బంగారు కోడిపెట్ట టాస్క్ లో ఈసారి టీమ్స్ గా కాకుండా ఎవరి గేమ్ ను వారు ఆడాలని బిగ్ బాస్ ప్రకటించాడు. టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ mrs. ప్రభావతి కోళ్ల ఫామ్ ను ప్రవేశపెట్టారు. కంటెస్టెంట్స్ అందరూ ఆమె కోళ్ల ఫామ్ లో పనిచేయాల్సి ఉంటుంది. కోడి కూత వినిపించినప్పుడు కోడి నుండి గుడ్లు పడతాయి. వాటిని కంటెస్టెంట్స్ తీసుకుని, ఆ గుడ్లపై వారి స్టిక్కర్స్ అంటించుకోవాల్సి ఉంటుంది. అలాగే మధ్యమధ్యలో పై నుండి గుడ్లు పడతాయి, వాటిని ఏరుకోవాల్సి ఉంటుంది.

అలాగే బాస్కెట్ లో ఉన్న గుడ్లనే లెక్కించాల్సి ఉంటుందని బిగ్ బాస్ తెలిపాడు. ఈ గేమ్ లో మరోసారి సన్నీని టార్గెట్ చేసింది ప్రియా. మాటిమాటికీ సన్నీను గుచ్చుతున్నట్లు మాట్లాడింది. అలాగే ప్రియా గేమ్ ప్లాన్ ప్రకారం ఆమె తీసుకున్న గుడ్లను వేరే వారికి దానం చేస్తూ వచ్చింది. ఈ టాస్క్ లో ఎక్కువగా ఎవరి గేమ్ వాళ్ళే ఆడారు కానీ, సన్నీ, కాజల్ కలిపి ఆడటం, మానస్ కు ప్రియా సపోర్ట్ చేయడం జరిగాయి. షణ్ముఖ్, జెస్సీ ఎప్పటిలానే కలిసి ఆడారు. మొదటి ఫేజ్ పూర్తయ్యాక బిగ్ బాస్ విశ్వను ఎవరి దగ్గర ఎన్ని గుడ్లు ఉన్నాయో లెక్క అడిగారు. విశ్వ లెక్కపెట్టి మానస్ వద్ద అత్యధికంగా 32 గుడ్లు ఉన్నాయని తెలిపాడు.

ఈరోజు టాస్క్ లో మరో ఆసక్తికర అంశం సిరి, షణ్ముఖ్ మధ్య వచ్చిన గ్యాప్. శ్రీరామ్ చంద్రతో సిరి ఉండడంతో షణ్ముఖ్ జెలస్ ఫీలైనట్లు అర్ధమవుతోంది.


Advertisement

Recent Random Post:

సనాతన ధర్మం ఉంటేనే దేశం నిలబడుతుంది : AP Deputy CM Pawan Kalyan

Posted : November 1, 2024 at 10:06 pm IST by ManaTeluguMovies

సనాతన ధర్మం ఉంటేనే దేశం నిలబడుతుంది : AP Deputy CM Pawan Kalyan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad